బ్రెసిలియా: యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చేపల ఎగుమతిపై బ్రెజిల్ తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని బ్రెజిల్ సంస్థలు ఆహార భద్రత నిబంధనలు పాటించడంలో అక్రమాలను కనుగొన్న నేపథ్యంలో ఈ నిలిపివేతను ప్రకటించింది. సెప్టెంబర్‌లో ఈయూ నిర్వహించిన ఆడిట్ నేపథ్యంలో జనవరి 3నుంచి విరామం కార్యాచరణను అమలులో పెట్టనున్నట్లు బ్రెజిల్ వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ కార్యాచరణలో భాగంగా యూరప్‌కు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే బ్రెజిల్ ఓడలను తనిఖీ చేపట్టారు. పది కంపెనీలకు గాను 6 కంపెనీల్లో తనిఖీ అధికారులు సమస్యలను కనుగొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment