Brasilia Declaration
-
10 రోజులుగా ఎక్కిళ్లు.. ఆస్పత్రి పాలైన అధ్యక్షుడు
బ్రసీలియా: జైర్ బోల్సోనారోను 10 రోజులుగా వెక్కిళ్లు వేధించసాగాయి. ఆయన పేగులో సమస్య తలెత్తిందని.. ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స అవసరమని బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బోల్సోనారోను పరీక్షల కోసం సావో పాలోలోని విలా నోవా స్టార్ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన కార్యాలయం బుధవారం పేర్కొంది. ఈ ఘటనపై బోల్సోనారో కుమారుడు ఫ్లావియో మాట్లాడుతూ.. తన తండ్రి బోల్సోనారోను బ్రసిలియాలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా బోల్సోనారో సావో పాలో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే.. ఆస్పత్రిలో బెడ్‌పై పడుకుని పడుకుని, సెన్సార్లు, కేబుళ్లు అమర్చి చికిత్స అందిస్తున్న ఫోటోను పేస్‌బుక్‌లో "ప్రతి ఒక్కరి మద్దతు, ప్రార్థనలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ పోస్ట్ చేశారు. కాగా జైర్ బోల్సోనారో 2018లో ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయనపై కత్తితో దాడి చేశారు. ఇక కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొవాగ్జిన్ డీల్‌కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు, బ్రెజిల్ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఖండించారు. అయితే ఇటీవలి జరిగిన ఎన్నికల్లో అతనిపై జనాదరణ తగ్గిపోతోంది. దీంతో ఇది వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ఇక జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు బ్రెజిల్లో 5,35,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
ఉగ్రవాదంతో ట్రిలియన్ డాలర్ల నష్టం
బ్రసీలియా: ఉగ్రవాదం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం కారణంగా నెలకొన్న పరిస్థితులు వాణిజ్య, వ్యాపార రంగాలను పరోక్షంగానైనా, లోతుగా దెబ్బతీశాయన్నారు. 11వ బ్రిక్స్ సదస్సులో భాగంగా జరిగిన ప్లీనరీ సమావేశంలో గురువారం మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో బ్రిక్స్ దేశాల సహకారాన్ని మోదీ ప్రశంసించారు. బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని ప్రఖ్యాత తమారటి ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో ఇతర సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతల సమక్షంలో మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధికి, శాంతి, సౌభాగ్యాలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందన్నారు. ‘ఒక అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధి ఉగ్రవాదం కారణంగా 1.5% తగ్గింది. గత పదేళ్లలో ఉగ్రవాదం కారణంగా 2.25 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు’ అని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, జల నిర్వహణ సవాలుగా మారాయని, బ్రిక్స్ దేశాల తొలి జలవనరుల మంత్రుల సమావేశాన్ని భారత్‌లో నిర్వహించాలని అనుకుంటున్నామని మోదీ తెలిపారు. ‘ఇటీవలే భారత్‌లో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాం. ఫిట్నెస్, ఆరోగ్యం విషయాల్లో సభ్య దేశాల సంప్రదింపులు మరింత పెరగాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య జరిగే వాణిజ్యం వాటా కేవలం 15 శాతమే. కానీ ఈ ఐదు దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 40% పైగా ఉంది. అందువల్ల వాణిజ్యం, పెట్టుబడుల్లో ద్వైపాక్షిక సహకారంపై బ్రిక్స్ దేశాలు దృష్టి పెట్టాల్సి ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో బ్రిక్స్ దిశ ఎలా ఉండాలో చర్చించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ‘సృజనాత్మక భవితకు ఆర్థికాభివృద్ధి’ అనే థీమ్ సరైనదని మోదీ అభిప్రాయపడ్డారు. గణతంత్రానికి బ్రెజిల్ అధ్యక్షుడు 2020లో భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ పాల్గొననున్నారు. ఈ మేరకు మోదీ ఆహ్వానానికి ఆయన సంతోషంగా ఆమోదం తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారొతో బుధవారం మోదీ సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి. జిన్‌పింగ్, పుతిన్‌లతో చర్చలు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో మోదీ విడిగా మాట్లాడారు. రష్యాలో వచ్చే సంవత్సరం మేలో జరిగే ‘విక్టరీ డే’వేడుకలకు మోదీని పుతిన్ ఆహ్వానించారు. రైల్వేలో ద్వైపాక్షిక సహకారంపై, ముఖ్యంగా నాగపూర్, సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడంపై సమీక్ష జరిపారు. -
ఈయూకు చేపల ఎగుమతి తాత్కాలికంగా నిలిపివేత
బ్రెసిలియా: యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చేపల ఎగుమతిపై బ్రెజిల్ తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని బ్రెజిల్ సంస్థలు ఆహార భద్రత నిబంధనలు పాటించడంలో అక్రమాలను కనుగొన్న నేపథ్యంలో ఈ నిలిపివేతను ప్రకటించింది. సెప్టెంబర్‌లో ఈయూ నిర్వహించిన ఆడిట్ నేపథ్యంలో జనవరి 3నుంచి విరామం కార్యాచరణను అమలులో పెట్టనున్నట్లు బ్రెజిల్ వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ కార్యాచరణలో భాగంగా యూరప్‌కు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే బ్రెజిల్ ఓడలను తనిఖీ చేపట్టారు. పది కంపెనీలకు గాను 6 కంపెనీల్లో తనిఖీ అధికారులు సమస్యలను కనుగొన్నారు. -
బర్గర్లు ఇవ్వమంటే.. ఇవ్వరా?!
రియో డి జెనీరియో : బ్రెజిల్‌లోని అత్యంత ఖరీదైన నగరాల్లో రియో డిజెనీరియో ఒకటి. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా జరిగే ప్రాంతం కావడంతో ఖరీదైన హోటళ్లు, రిసార్టులు, రెస్టార్లు భారీగా ఉన్నాయి. ఇవి ఏడాది పొడుగునా బిజీగానే ఉంటాయి. అందులోనూ మెక్ డోనాల్డ్ రెస్టారెంట్‌కు స్థానికంగా డిమాడ్ ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆరుమంది వ్యక్తులు రెస్టారెంట్ వచ్చి 40 బర్గర్లు కావాలని చెప్పారు. వేడివేడిగా బర్గర్లు తెచ్చాక.. బిల్ పే చేయమని కౌంటర్లోని వ్యక్తి అడిగాడు.. బర్గర్ల కోసం వచ్చిన వ్యక్తి.. నేను బిల్ పే చేయను.. అంటూ.. తన వెంట తెచ్చుకున్న గన్‌తో ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. అతనికి సహాయంగా మరో అయిదుమంది కూడా తుపాకులకు పని చెప్పారు. బుల్లెట్లు ఎక్కడ తగులుతాయన్న భయంతో రెస్టారెంట్లో ఉన్న వాళ్లంతా.. టేబుళ్ల కింద.. దాక్కున్నారు. ఈ ఘటనలో అదృష్టవవాత్తు ఎవరూ గాయపడలేదని మెక్‌డోనాల్డ్ అధికారులు ప్రకటించారు. బుల్లెట్లు తగిలి రెస్టారెంట్ పర్నీచర్ చాలా వరకూ పాడైందని.. చెప్పారు. అయితే బర్గర్లుకు డబ్బులు చెల్లించకుండా.. తుపాకి కాల్పుల పాల్పడ్డవారు.. డ్రగ్స్ డీలర్లని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు. -
ప్రమాదాల అడ్డుకట్టకు లీడ్ ఏజెన్సీ
జాతీయ రహదారి భద్రత వర్క్‌షాప్‌లో సిఫారసులు సాక్షి, విశాఖపట్నం: రహదారి భద్రతకు సంయుక్తంగా పాటుపడాలని అన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇందుకోసం వినూత్న విధానాలను ప్రవేశపెట్టాలని సిఫారసు చేశాయి. రక్తమోడుతున్న రహదారుల్లో 2020 నాటికి ప్రమాదాల సంఖ్య సగానికి తగ్గించాలనే బ్రెజీలియా డిక్లరేషన్ స్ఫూర్తిగా విశాఖలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ రహదారి భద్రత వర్క్‌షాప్ శనివారం సాయంత్రం ముగిసింది. వివిధ రాష్ట్రాల మంత్రులు, రవాణాశాఖ కమిషనర్లు, ఐదు దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొని రహదారి భద్రతపై విస్తృతంగా చర్చించి సిఫార్సులు చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వీటి ఆమోదానికి చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి సూచించారు. పర్వతప్రాంతాలు ఎక్కువున్న హిమాచల్, మేఘాలయలాంటి రాష్ట్రాల్లో రోడ్డుభద్రతపై చర్చించి సిఫార్సులు చేయాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి రాష్ట్రంలోనూ లీడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని, కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ విధానాన్ని అన్నిరాష్ట్రాల్లో అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, రోడ్ల వెంబడి ఉండే ప్రైవేటు ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెం టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతోపాటు పరికరాల కొనుగోలుకు ఆర్థికసాయమందించాలని సిఫారసు చేసింది.