
క్రిభ్‌కో భూముల సర్వే అడ్డగింత
వెంకటాచలం మండలం సర్వేపల్లి పరిధిలో క్రి భ్‌కోకు కేటాయించిన భూములలో జరుగుతున్న సర్వేను ముత్యాలగుంట గ్రామస్తులు అడ్డుకున్నారు.
బినామీ పేర్లుతో లక్షలాది రూపాయల పేదల పరిహారాన్ని అధికారులు, అధికారపార్టీ నాయకులు దోచుకున్నారని గత ఏడాది పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఆందోళనలు చేశారు. అయితే సర్వేపల్లి పంచాయతీ పరిధిలోని ముత్యాలగుంట గ్రామం ఆనుకుని క్రి¿Œ కో కంపెనికీ చెందిన వారు శనివారం ఉదయం సర్వేపనులు చేపట్టారు. ముళ్లచెట్లను జేసీబీతో తొలగించారు. దీంతో ముత్యాలగుంట గ్రామస్తులు తమ నివాసాల పక్కనే క్రిభ్‌కో కంపెనీ గోడను కట్టనీయబోమని సర్వేను అడ్డుకున్నారు. క్రిభ్‌కో కంపెనీ నిర్వాహకులు రెవెన్యూ అధికారులకు తెలియజేయడంతో నెల్లూరు ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి తహసీల్దార్ చెన్నయ్య, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి వెళ్లి గ్రామస్తులు, క్రిభ్‌కో కంపెనీ నిర్వాహకులతో మాట్లాడారు. గ్రామంలోని నివాసాలకు దగ్గర ఫ్యాక్టరీ గోడ కట్టేందుకు సర్వేఎలా చేస్తారని గ్రామస్తులు అధికారులతో వాదనకు దిగారు. రికార్డులను పరిశీలించిన తరువాతే పనులు చేయాలని ఆర్డీవో క్రిభ్‌కో కంపెనీ సిబ్బందికి తెలియజేయడంతో పనులు నిలిపివేశారు.