కేటీపీఎస్‌లో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి
Published Mon, Oct 20 2014 1:59 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5వ దశలో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. శనివారం అర్ధరాత్రి 5వ దశ 11వ యూనిట్‌లో బాయిలర్ ట్యూబ్ లీకవడాన్ని గుర్తించిన అధికారులు ట్రిప్ చేశారు.
దీంతో రాష్ట్ర గ్రిడ్‌కు విద్యుదుత్పత్తి చేయడంలో తీవ్ర అంతరాయం వాటిల్లింది. కాగా, సీఈ సిద్దయ్య నేతృత్వంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ యూనిట్‌ను పునరుద్ధరించనున్నారు.
Advertisement
Advertisement