నిలిచిన అంతరరాష్ట్ర వంతెన పనులు | interstate bridge build works stopped | Sakshi

నిలిచిన అంతరరాష్ట్ర వంతెన పనులు

Aug 7 2016 11:53 PM | Updated on Sep 4 2017 8:17 AM

ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పెదబయలు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డపై ఒడిశా ప్రభుత్వం రూ.13.50 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు నిలిచిపోయాయి.

పెదబయలు : ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పెదబయలు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డపై ఒడిశా ప్రభుత్వం రూ.13.50 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు నిలిచిపోయాయి. మన్యంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో మత్స్యగెడ్డలో నీరు ఉధతంగా ప్రవహిస్తోంది. దీంతో 20 రోజుల నుంచి పనులు ఆపేశారు. వంతెన కోసం 9 ఫిల్లర్ల వేస్తున్నారు. ఈ ఏడాది మార్చి చివరి వారంలో పనులు ప్రారంభించారు. పనులు వేగంగా జరుగుతున్నా వర్షాలు, నీటి ఉధతి వల్ల బ్రేక్‌ పడింది. వర్షాలు తగ్గితే గాని పనులు ప్రారంభించే అవకాశాలు లేవు. వారధి ఎప్పుడు పూర్తవుతుందా అని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆశగా చూస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement