Bridge Works
-
Maharashtra Samruddhi Expressway: నిర్మాణ దశలో ఘోర ప్రమాదం
ముంబై: మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వంతెనలోని శ్లాబులను యథాస్థానంలో కూర్చోబెట్టేందుకు వినియోగించే గిర్డెర్ లాంఛర్ కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సెగ్మెంట్ లాంచర్(క్రేన్)తో కలుపుకుని దాదాపు 700 టన్నుల బరువైన గిర్డెర్ లాంఛర్ 35 మీటర్ల ఎత్తునుంచి కిందకు కుప్పకూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది దాని కింద నలిగిపోయారు. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైను నాగ్‌పూర్‌ను కలుపుతూ 701 కిలోమీటర్ల పొడవైన సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు. ముంబైకి 80 కి.మీ.ల దూరంలో థానె జిల్లాలో సార్లాంబే గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రిదాటాక ఈ ఘటన జరిగింది. ఘటనపై నిపుణులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఉపముఖ్యమంత్రి ఫడ్నవిస్ చెప్పారు. పోతపోసిన బాక్స్ శ్లాబులను తర్వాతి రోజు నిర్మాణం కోసం సిద్ధంచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేíÙయా ఇస్తామన ప్రధాని ప్రకటించారు. తలో రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. దుర్ఘటన నేపథ్యంలో సంబంధిత ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేలో ఇప్పటికే 600 కి.మీ.ల మేర నిర్మాణం పూర్తయి రాకపోకలు సైతం మొదలయ్యాయి. ఈ 101 కి.మీ.ల నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీద గత ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. -
తక్షణమే పూర్తి చేయాలి.. సీఎం జగన్ ఆదేశాలు
-
శరవేగంగా జరుగుతున్న పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జ్ పనులు
-
అడుగు దూరంలో కలల వంతెన
శ్రీకాకుళం, వీరఘట్టం: కిమ్మి–రుషింగి వంతెన నిర్మాణం ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. పనులన్నీ ఆఖరి దశకు చేరుకున్నాయి. అయితే చివర్లో నిర్మించాల్సిన ఒక్క పిల్లర్ పనులు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అక్కడే ఆగిపోయింది. కొత్త సర్కారు వచ్చాక డిజైన్ మార్పుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో లైన్‌క్లియర్ అయింది. నిర్మాణాలకు అనువుగా ఉండే వేసవి కాలంలో పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు పట్టుదలగా ఉన్నారు. నాగావళి నదిలో కిమ్మి–రుషింగి గ్రామాల మధ్య 2008లో జరిగిన పడవ ప్రమాదంలో ఎనిమిదిమంది మృతి చెందడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే వంతెన నిర్మాణానికి అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేసింది. రూ.29 కోట్ల నాబార్డు నిధులతో 2012లో పనులు ప్రారంభమయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధి చూపకపోవడంతో వంతెన పనుల్లో వేగం తగ్గింది. గతేడాది మార్చికి పూర్తి కావాల్సిన ఈ పనులు ఏడాదిగా నిలిచిపోయాయి. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనుల తీరు ఉంది. నిలిచిపోయిన 11వ పిల్లర్ పనులు చివరి దశలో నిర్మించాల్సిన పిల్లర్ పనులను వాస్తవానికి 2013లో ప్రారంభించారు. అయితే ఈ పనులు సగంలో ఉండగా అదే ఏడాది నాగావళికి వచ్చిన భారీ వరదల్లో ఈ పిల్లరు భూమిలోకి కూరుకుపోయింది. దీంతో అధికారులు ఈ పిల్లరును సరిచేయకుండా మిగతా పిల్లర్ల పనులు వేగంగా పూర్తిచేశారు. తర్వాత భూమిలో కూరుకుపోయిన పిల్లర్‌ను బాంబులు పెట్టి విచ్ఛిన్నం చేశారు. అయితే బాంబులు పెట్టి పిల్లర్‌ను తొలగించినప్పటికీ దీని శకలాలు భూమి అడుగులో ఉండిపోయాయి. మొదట అనుకున్న డిజైన్ ప్రకారం ఇదే ప్రాంతంలో పిల్లర్ పనులు చేయాల్సి ఉంది. అయితే ఈ పనులకు భూమి కిఐద ఉన్న గత పిల్లర్ శకలాలు అడ్డుగా ఉండడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడ నిర్మించాల్సిన పిల్లర్ డిజైన్ మార్చి ప్రభుత్వానికి నివేదించారు. ఇంజనీరింగ్ అధికారులు పంపిన నివేదికను ప్రస్తుత ప్రభుత్వం పరిశీలించి అనుమతులు కూడా ఇచ్చింది. అయితే కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడంతో ఈ ఏడాది కూడా తమకు పడవ ప్రయాణమే గతి అని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి తమకు రూ.2 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వంతెన పనులు నిర్వహిస్తున్న ఆర్ఎస్వీ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. అందువల్లనే తాము మిగతా పనులు చేపట్టలేకపోయామన్నారు. కొద్ది రోజుల్లో పనులు చేపడతాం చివరిలో నిలిచిపోయిన ఒకే ఒక్క పిల్లర్ పనులకు సాంకేతిక అనుమతులు కూడా కొత్త ప్రభుత్వం ఇచ్చింది. పిల్లర్ పనులు చేపట్టే చోట నీటి ప్రవాహం ఉండడంతో ఇన్ని రోజులూ పనులు చేపట్టలేకపోయాం. ప్రస్తుతం వాతావరణం పనులకు అనుకూలంగా ఉంది. మరి కొద్ది రోజులు పనులు పూర్తి చేస్తాం.–నాగభూషణరావు, ఏఈ, కిమ్మి–రుషింగి వంతెన పర్యవేక్షకుడు -
రెండు రాష్ట్రాల మధ్య చేపల కూర చిచ్చు
- ఇరు రాష్ట్రాల కూలీల కొట్లాట - 12 మంది కార్మికులపై కేసు భద్రాచలంటౌన్: చేపల కూర ఇరు రాష్ట్రాల కార్మికుల మధ్య కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనపై భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. దీనిపై పట్టణ అదనపు ఎస్సై బి.హరిసింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోదావరిపై జరుగుతున్న రెండవ వారధి నిర్మాణ పనుల నిమిత్తం బీహార్, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కార్మికులు వలస వచ్చి పనుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బీహార్‌కు చెందిన కార్మికులు చేపలు తెచ్చుకొని వంట చేసుకొని తినటానికి సిద్ధమయ్యారు. మద్యం సేవించి వచ్చిన వెస్ట్‌బెంగాల్‌కు చెందిన 12 మంది కార్మికులు చేపల కూర మాకూ కావాలని కోరారు. బీహార్ కార్మికులు ఇచ్చేది లేదని పేర్కొనటంతో వాగ్వాదానికి దిగిన వెస్ట్‌బెంగాల్ కార్మికులు ఆగ్రహంతో అక్కడే ఉన్న కర్రలు, ఇనుప రాడ్లతో వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురిని సెక్యూరిటీ సిబ్బంది పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీహార్‌కు చెందిన కార్మికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు ఎస్సై హరిసింగ్ పేర్కొన్నారు. -
నర్సరీలకు ఎండదెబ్బ
- ఎండుతున్న మొక్కలు - కానరాని నీడ పందిళ్లు - సగం కూడా దక్కడం అనుమానమే! - వచ్చే నెల నుంచే హరితహారం - ప్రశ్నార్థకంగా పథకం అమలు మెదక్ జోన్: మండుతున్న ఎండలకు నర్సరీల్లో మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం హరితహారం పథకం అమలుకు అడ్డంకిగా మారాయి. మరో నెలరోజుల్లో హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటాల్సి ఉంది. కానీ అధికారుల ప్రాణాళికకు, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలకు చాలావ్యత్యాసం కనిపిస్తోంది. లక్ష్యం మేరకు మొక్కలు కానరావడంలేదు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 1.48 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రాణాళికను సిద్ధం చేశారు. అందుకు అణుగుణంగా 122 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. గత సంవత్సరం సైతం సరైన వర్షాలు లేకపోవటంతో నర్సరీల్లో పెంచిన మొక్కలు 75 శాతం మేర అలాగే ఉన్నాయి. అందులో 50 శాతం పైగా మొక్కలు ఎండలకు ఎండిపోయాయి. గతయేడాది పెంచిన మొక్కలతో పాటు ఈయేడు మరికొన్ని మొక్కలను పెంచి మొత్తం 1.48 కోట్ల మొక్కలను నాటాలని ఫారెస్టు అధికారులు నిర్ణయించారు. కాని ఎండలు మండుతుండటంతో ఇప్పటికే 37 లక్షలకు పైగా మొక్కలు ఎండినట్టు సమాచారం. మొత్తానికి లక్ష్యం దిశగా అధికారులు అడుగు ముందుకు వేస్తున్నారు. ఇందుకోసం మొక్కలను ఏఏ ప్రాంతాల్లో నాటాలి? ఏ ఏమొక్కలు నాటాలి? రైతులు ఏ రకమైన మొక్కలను కోరుకుంటున్నారు? రోడ్లకు ఇరువైపుల ఎన్ని లక్షల మొక్కలు నాటాలి? అనేదానిపై ఇప్పటికే కసరత్తు చేశారు. అంతే కాకుండా అడవుల్లోని గ్యాప్‌ప్లాంటేషన్ 425 ఎకరాల్లో నాటేం దుకు సైతం అధికారులు ప్రాణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. కానీ ఎప్పుడు లేని విధంగా ఈయేడు ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో నర్సరీల్లోని మొక్కలు ఎండిపోతున్నాయి. అందుకు తోడు క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం తోడైంది. దీంతో హరితహారం పథకం ఈయేడు అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం కష్టమని పలువురు భావిస్తున్నారు. ఎండల నుంచి నర్సరీల్లోని మొక్కలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నీడకోసం షెడ్ నెట్స్‌ను పంపిణీ చేస్తే అధికారులు వాటిని చాలాచోట్లా మూలాన పడేశారు. కొన్ని గ్రామాల్లో నర్సరీ నిర్వాహకులు ఆ నెట్లను మొక్కలకు కట్టకుండా వారి ఇళ్లకు తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్షం వల్లా షెడ్ నెట్లను ఏర్పాటు చేయక పోవటంతో నర్సరీల్లోని సగానికి పైగా మొక్కలు ఎండిపోతున్నాయి. అయినా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు ఉన్నాయి. బైక్‌లు సైతం ఇచ్చినా.. ఫారెస్టు అధికారులు ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులకు కోట్లాది రూపాయలను వెచ్చించి బైక్‌లను సైతం ఇచ్చింది. కానీ ఆ బైక్‌లతో సొంత పనులకే ప్రాధాన్యం ఇస్తూ అడవుల సంరక్షణను మరిచి పోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో మొక్కలను రక్షించేందుకు తగుచర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరితహరం పథకంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం వచ్చేవర్షాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1.48 కోట్ల మొక్కలను నాటడం కష్టమనే చెప్పాలి. -
గ్రామాలకు మెరుగైన రవాణా
కొండాపూర్: అభివృద్దే ప్రభుత్వ ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందరి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని మారేపల్లి గ్రామ శివారులో గల ఆర్అండ్బీ నిధుల ద్వారా రూ.70 లక్షలతో నిర్మించనున్న వంతెన పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పల్లెలు అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా ప్రతి గ్రామానికి బీటీ రోడ్డులను వేయిస్తామన్నారు.అదేవిధంగా ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్డును విస్తస్తామన్నారు.ప్రతి ఇంటికి మంచి నీరు అందించడం కోసం మిషన్ భగీరథను ప్రవేశపెట్టామన్నారు. ఆహార భద్రత కార్డు ద్వారా ఇంటిలోని ప్రతీ ఒక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యం అందిస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా కుంటుపడిన చెరువులను, కుంటలను పూడికతీత తొలగించి వాటికి మళ్లీ పూర్వవైభవం తెచ్చి భూగర్భజలాల స్థాయిని పెంచేందుకు మిషన్‌కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.దళితుల అభివృద్ధి కోసం భూమి లేని నిరుపేద దళితులకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమిని అందివ్వడమే కాకుండా మెదటి సంవత్సరం విత్తనాలతో పాటు,ఎరువులను కూడా అందిచామన్నారు. రైతులకు తాగు, సాగునీరు అందించడమే లక్ష్యంగా మహరాష్ట్రతో ఒప్పందం చేయడం తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయమన్నారు.తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విఠల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు అమీనోద్దిన్, సర్పంచ్ రుక్మోద్దిన్, తహసీల్దార్ లావణ్య, ఎంపీటీసీ సభ్యులు పర్త్యానాయక్, సత్యాగౌడ్, నాయకులు మల్లాగౌడ్, మల్లేశం, లక్ష్మారెడ్డి, బుచ్చిరెడ్డి, నాగయ్య, బి జలేందర్, నర్సిములు, అంజిరెడ్డి, శ్రీకాంత్, అబ్దుల్‌రహీం, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన అంతరరాష్ట్ర వంతెన పనులు
పెదబయలు : ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పెదబయలు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డపై ఒడిశా ప్రభుత్వం రూ.13.50 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు నిలిచిపోయాయి. మన్యంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో మత్స్యగెడ్డలో నీరు ఉధతంగా ప్రవహిస్తోంది. దీంతో 20 రోజుల నుంచి పనులు ఆపేశారు. వంతెన కోసం 9 ఫిల్లర్ల వేస్తున్నారు. ఈ ఏడాది మార్చి చివరి వారంలో పనులు ప్రారంభించారు. పనులు వేగంగా జరుగుతున్నా వర్షాలు, నీటి ఉధతి వల్ల బ్రేక్ పడింది. వర్షాలు తగ్గితే గాని పనులు ప్రారంభించే అవకాశాలు లేవు. వారధి ఎప్పుడు పూర్తవుతుందా అని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆశగా చూస్తున్నారు.