
సాక్షి,విజయవాడ: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూటమి ప్రభుత్వం అన్ని విచారణలు నిలిపివేసింది. విచారణలు నిలిపివేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం(డిసెంబర్21) ఉత్తర్వులు జారీ చేశారు. 2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏబీ వెంకటేశ్వర్‌రావుపై ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర్‌రావుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించారు. ఈ విచారణలన్నింటిని ఎత్తివేస్తున్నట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఏబీ వెంకటేశ్వర్‌రావు ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు.
