బదిలీకి పొలిటికల్‌ బ్రేక్‌ | transfers stopped with politics | Sakshi
Sakshi News home page

బదిలీకి పొలిటికల్‌ బ్రేక్‌

Published Mon, Oct 10 2016 12:31 AM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM

transfers stopped with politics

కోడుమూరు :  కోడుమూరు నియోజకవర్గంలో  ఎమ్మెల్యే మణిగాంధీ, ఎదురూరు విష్ణువర్థన్‌రెడ్డి మధ్య విబేధాలకు అధికారులు నలిగిపోతున్నారు. కోడుమూరు సర్కిల్‌కు సీఐగా రావాలంటేనే భయపడే పరిస్థితులు అధికారుల్లో నెలకొంది. బదిలీల సందర్భంగా ముగ్గురు సీఐలు కోడుమూరు సర్కిల్‌ను ఎంపిక చేసుకుని చివరి సమయంలో విరమించుకున్నట్లు సమాచారం. చివరకు వారు ఊహించిందే నిజమైంది. ఇటీవల కోడుమూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైన శ్రీనివాసులు ఇంత వరకు బాధ్యతలు చేపట్టలేదు. ఆయనకు పొలిటికల్‌ బ్రేక్‌ పడినట్లుస సమాచారం.

కోడుమూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న డేగల ప్రభాకర్‌ కర్నూలు టు–టౌన్‌కు ఈ నెల 6వ తేదీన బదిలీ అయ్యారు. స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేస్తున్న శ్రీనివాసులును కోడుమూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. అయితే సీఐ శ్రీనివాసులును ఎమ్మెల్యే మణిగాంధీ సిఫారస్‌ చేశారన్న కారణంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురూరు విష్ణువర్థన్‌రెడ్డి సీఐ నియామకాన్ని ఇన్‌చార్జి మంత్రి అచ్చంనాయుడు ద్వారా నిలుపుదల చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్‌చార్జి సీఐగా డేగల ప్రభాకర్‌ కొనసాగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement