Model Kine-Chan Stopped From Boarding Flight Over Her Bikini Dress In Brazil - Sakshi
Sakshi News home page

బికినీతో ఎయిర్‌పోర్టుకు మోడల్.. షాక్‌లో సిబ్బంది ఏం చేశారంటే..?

Published Mon, Aug 21 2023 5:06 PM | Last Updated on Mon, Aug 21 2023 7:59 PM

Model Stopped From Boarding Flight Over Her Bikini Dress - Sakshi

బికినీ డ్రెస్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చింది బ్రిజెల్‌కు చెందిన ఓ మోడల్‌. మోడల్‌ విపరీత స్వభావానికి ఖంగుతిన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్యూరిటీ పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగారు. తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. 

కేన్‌ చాన్‌(21) ఓ ప్రముఖ మోడల్. బ్రెజిల్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న కేన్‌ చాన్‌ను ఇన్‌స్టాలో 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. నిత్యం ఈవెంట్‌లతో బిజీగా ఉండే ఆవిడ.. బ్రెజిల్‌లోని నవేగాంటెస్‌ ఎయిర్‌పోర్టుకు బికినీలో వెళ్లింది. కేవలం నల్లని బికినీ, విగ్‌, నల్లని షాండిల్స్‌ను ధరించింది. ఇది అచ్చం అనిమే వెబ్ సిరీస్ సైబర్‌ ఫంక్‌లోని రెబక్కా వేషధారణలాగే ఉంది. 

మోడల్ వేషధారణ చూసిన ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను అడ్డగించారు. ఇలాంటి దుస్తులు ధరిస్తే అనుమతించబోమని అన్నారు. శరీరాన్ని కప్పుకునే దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈవెంట్‌కు ఆలస్యం అవుతున్న కారణంగానే తాను అలాంటి దుస్తులు ధరించాల్సి వచ్చిందని కేన్ చాన్ తెలిపారు. సమయం వృథా చేయలేక ఈవెంట్‌కు సంబంధించిన దుస్తులు వేసుకున్నానని చెప్పారు. 

కేన్‌ చాన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు మోడల్‌కు మద్దతు తెలపగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో కనీస విలువల్ని కాపాడాలని, దుస్తులు సరిగా ధరించాలని మోడల్‌కు విన్నవించారు. కొన్నిసార్లు ఈవెంట్ల మధ్య చాలా తక్కువ సమయం ఉంటుందని, ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుందని మరికొందరు ఆమెకు మద్దతు పలికారు. కొందరైతే లవ్ యూ మేడమ్..  కానీ ఇలాంటి డ్రెస్సులు వద్దని సూచించారు. 

ఇదీ చదవండి: సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement