boarding
-
రైలు ఎక్కుతూ కాలు జారిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్!
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారి పడిపోయిన ఓ మహిళను రైల్వే కానిస్టేబుల్ కాపాడిన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటన హౌరా స్టేషన్ ఓల్డ్ కాంప్లెక్స్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 10.50 గంటలకు 40 ఏళ్ల ఫాతిమా ఖాతూన్ తన బంధువుతో పాటు హౌరా-తారకేశ్వర్ లోకల్ ఎక్కేందుకు వచ్చారు. వీరిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో ఫాతిమా బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. ఇంతలో రైలు వేగం పెరగడంతో ఆమె రైలు పట్టాలకు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. అయితే ఆమె బంధువు ఆమెను రైలు కిందకు జారిపోకుండా పైకి లాగడానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన అక్కడే ఉన్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎల్కే బౌరీ వెంటనే ఫాతిమా వద్దకు పరిగెత్తారు. ఆమె చేయి పట్టుకుని పైకిలాగి ఆమె ప్రాణాలను కాపాడారు. సీసీటీవీ ఫుటేజీలో.. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న పలువురు ప్రయాణికులు ఫాతిమాను రక్షించేందుకు ప్రయత్నించడాన్ని గమనించవచ్చు. పలువురు పోలీసులు కూడా ఆమెకు సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పోలీసుల చొరవను తూర్పు రైల్వే ప్రశంసించింది. ఇది కూడా చదవండి: రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం चलती ट्रेन में चढ़ते समय फिसल गई महिला, फरिश्ता बनकर आए पुलिसकर्मी ने बचाई जान pic.twitter.com/7hyYXCh6Pc — NDTV India (@ndtvindia) November 30, 2023 -
బికినీతో ఎయిర్‌పోర్టుకు మోడల్.. ఖంగుతిన్న సిబ్బంది..
బికినీ డ్రెస్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చింది బ్రిజెల్కు చెందిన ఓ మోడల్. మోడల్ విపరీత స్వభావానికి ఖంగుతిన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్యూరిటీ పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగారు. తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. కేన్ చాన్(21) ఓ ప్రముఖ మోడల్. బ్రెజిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కేన్ చాన్‌ను ఇన్‌స్టాలో 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. నిత్యం ఈవెంట్లతో బిజీగా ఉండే ఆవిడ.. బ్రెజిల్‌లోని నవేగాంటెస్ ఎయిర్‌పోర్టుకు బికినీలో వెళ్లింది. కేవలం నల్లని బికినీ, విగ్, నల్లని షాండిల్స్ను ధరించింది. ఇది అచ్చం అనిమే వెబ్ సిరీస్ సైబర్ ఫంక్లోని రెబక్కా వేషధారణలాగే ఉంది. మోడల్ వేషధారణ చూసిన ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను అడ్డగించారు. ఇలాంటి దుస్తులు ధరిస్తే అనుమతించబోమని అన్నారు. శరీరాన్ని కప్పుకునే దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈవెంట్‌కు ఆలస్యం అవుతున్న కారణంగానే తాను అలాంటి దుస్తులు ధరించాల్సి వచ్చిందని కేన్ చాన్ తెలిపారు. సమయం వృథా చేయలేక ఈవెంట్‌కు సంబంధించిన దుస్తులు వేసుకున్నానని చెప్పారు. View this post on Instagram A post shared by Kine-chan/Digital Influencer (@kinechan2.0) కేన్ చాన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు మోడల్‌కు మద్దతు తెలపగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో కనీస విలువల్ని కాపాడాలని, దుస్తులు సరిగా ధరించాలని మోడల్‌కు విన్నవించారు. కొన్నిసార్లు ఈవెంట్ల మధ్య చాలా తక్కువ సమయం ఉంటుందని, ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుందని మరికొందరు ఆమెకు మద్దతు పలికారు. కొందరైతే లవ్ యూ మేడమ్.. కానీ ఇలాంటి డ్రెస్సులు వద్దని సూచించారు. ఇదీ చదవండి: సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు! -
విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ‘డిజి యాత్ర’ ప్రారంభం
గన్నవరం: విమాన ప్రయాణికుల బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేసే డిజియాత్ర సేవలు శుక్రవారం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన డిజియాత్ర సేవలను ఉపయోగించుకుని ఇండిగో విమానంలో తిరుపతికి వెళ్లారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విమానాశ్రయాల్లో ప్రయాణికుల ప్రవేశాలను సులభతరం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దీనివల్ల చెక్ ఇన్, బోర్డింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ.. గత నెల రోజులుగా దీనిని ప్రయో గాత్మకంగా పరీక్షించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 9,500 మంది ప్రయాణికులు డిజియాత్ర అప్లికేషన్‌ను రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇది కాగిత రహిత విధానమని.. ఫేషియల్ రికగ్నైజేషన్ ఆధారంగా ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, ఎయిర్పోర్ట్ జాయింట్ జీఎం సూర్యభగవానులు, టెర్మినల్ మేనేజర్ అంకిత్, ఎయిర్పోర్ట్ ఏసీపీ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు!
సాక్షి, న్యూఢిల్లీ: ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను జర్మనీలోని ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేశారని సోమవారం ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. తాజాగా పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయం స్పందించారు. పంజాబ్ సీఎంపై వచ్చిన ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని సింధియా తెలిపారు. అయితే ఈ ఘటన విదేశీ గడ్డపై జరిగినందున అసలు నిజానిజాలు ఏంటో తెలుసుకోవాల్సి ఉందన్నారు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ వివరాలు వెల్లడించాల్సి ఉందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని తనకు విజ్ఞప్తులు అందాయని, కచ్చితంగా దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ఏం జరిగింది? జర్మనీ పర్యటన ముగించుకుని సోమవారం ఢిల్లీకి తిరిగివచ్చారు భగవంత్ మాన్. అయినే ఫుల్లుగా తాగి ఉన్న కారణంగా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేశారని, దీనివల్ల నాలుగు గంటలు ప్రయాణానికి ఆలస్యమైందని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. భగవంత్ మాన్ పంజాబీల పరువు తీశారని శిరోమణి ఆకాలీదళ్ ధ్వజమెత్తింది. అయితే లుఫ్తాన్సా సంస్థ దీనిపై స్పష్టత ఇచ్చింది. విమానాన్ని మార్చాల్సి రావడం వల్లే ఆలస్యం అయిందని చెప్పింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆరోపణలను ఖండించించి. పంజాబ్ సీఎంను అప్రతిష్టపాలు చేసేందుకే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగింది. భగవంత్ మాన్ సోమవారం జర్మనీ నుంచి ఢిల్లీకి చేరుకుని నేరుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. చదవండి: మాట్లాడింది మమతేనా? మోదీకి సపోర్ట్ చేయడమేంటి? -
ఎయిరిండియాకు షాక్, భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూపు యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ప్రయాణీకులను విమానం ఎక్కకుండా అక్రమంగా నిరోధించినందుకు గాను రూ. 10 లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటు అయ్యే టికెట్లు కలిగి ఉన్నా ప్రయాణికులను బోర్డింగ్ నిరాకరించిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు డీజీసీఏ వెల్లడించింది. చెల్లుబాటు అయ్యే టిక్కెట్లున్నా, వాటిని సమయానికి ప్రెజెంట్ చేసినప్పటికీ, అనేక విమానయాన సంస్థలు బోర్డింగ్ నిరాకరించిన వచ్చిన ఫిర్యాదుల నివేదికల నేపథ్యంలో డీజీసీఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అదే విధంగా మార్గదర్శకాలను కొన్ని విమానయాన సంస్థలు వాటిని పాటించడం లేదని మండిపడింది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో వరుస తనిఖీల తర్వాత ప్రకటన జారీ చేసింది. అకారణంగా ప్రయాణీకులను బోర్డింగ్‌కు నిరాకరించిన ఎయిరిండియాపై రెగ్యులేటరీ భారీ జరిమానా విధించింది. ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్‌లో భాగంగా ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. 2010 నిబంధనల ప్రకారం వ్యాలిడ్ టికెట్లు ఉన్నప్పటికీ ప్యాసింజర్లను బోర్డింగ్‌కు అనుమతించని సందర్భంలో వారికి గంటలోపే మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలని డీజీసీఏ తెలిపింది. గంటలోపే ప్రత్యామ్నాయం విమానాన్ని ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి పరిహారం అందిచాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. ఆయా ప్రయాణీకులకు 24 గంటల్లోపు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయని పక్షంలో ప్రయాణికులకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. అదే 24 గంటలు దాటితే రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని డీజీసీఏ పేర్కొంది. -
ఆ మహిళలకు విమానంలోకి నో ఎంట్రీ
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో మహిళలపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. మగ తోడు లేకుండా వారు ఒంటరిగా విమానాల్లో ప్రయాణించడానికి వీల్లేదని తాలిబన్లు తాజాగా హుకుం జారీ చేశారు. శుక్రవారం కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒంటరి మహిళలను విమానమెక్కేందుకు అనుమతించలేదు. బాలికలు ఆరో తరగతి వరకే చదువుకోవాలన్న ఆదేశాలను నిరసిస్తూ రాజధాని కాబూల్‌లో బాలికలు శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. చదవండి: (మాట తప్పిన తాలిబన్లు.. షాకింగ్ నిర్ణయంతో ఆవేదనలో బాలికలు) -
‘వామ్మో ఏంటా బట్టలు.. ముందు ఫ్లైట్ దిగు’
ఆడవాళ్ల వేషధారణ సొసైటీలో ఎడతెగని ఓ చర్చాంశం. అయితే తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే.. ఆమె వెస్ట్రన్ దేశాలకు వలస వెళ్లింది. అక్కడ తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఊహించని రీతిలో అక్కడా ‘చేదు’ అనుభవమే ఎదురయ్యిందంటూ కన్నీళ్లతో వాపోయింది. కానీ.. దెనిజ్ సెపినర్(26).. టర్కీ ఫిట్నెస్ మోడల్. అయితే అక్కడి సంప్రదాయలు ఆమెను ప్రొఫెషనల్‌లోకి అనుమతించలేదు . దీంతో అమెరికాకు వలస వెళ్లింది. ఫిట్నెస్ మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ ఎక్కిన కాసేపటికే సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అన్నాడు. ఆమె అది జోక్‌గా అనుకుందట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట. కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేన’ంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని వాపోయిందామె.‘ఆ మాట వినగానే భయమేసింది. వణికిపోయా. వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా. రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా. కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్ చేసింది దెనిజ్. ట్విస్ట్ అయితే దెనిజ్ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ‘ఫ్లైట్స్‌లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం మా సిబ్బంది చేసింది. కానీ, ఆమెనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిగా అలా చేయాల్సి వచ్చింద’ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. దీంతో ఆమెకే నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు కాసేపు ప్రైవసీ పెట్టేసిందామె. -
పేపర్‌లెస్ ఈ–బోర్డింగ్.. క్యూ మేనేజ్మెంట్
శంషాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్ తగ్గుముఖం పడుతున్న వేళ సురక్షితమైన విమానయానానికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. ఆయా రాష్ట్రాలు దేశీయ ప్రయాణంలో నిబంధనలను సడలించడంతో మళ్లీ విమానయానం ఊపందుకునే అవకాశం ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను కల్పించినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయంలోని విశేషాలివీ ►కాంటాక్ట్‌లెస్ బోర్డింగ్‌లో భాగంగా చెక్–ఇన్ హాల్స్ వద్ద సెల్ఫ్ కియోస్కులను ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ చెక్–ఇన్ ప్రక్రియ పూర్తవుతుంది. ►శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు. ►దేశంలోనే ఈ–బోర్డింగ్ సదుపాయం ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్. ►దేశీయ ప్రయాణంలో నిబంధనల సడలింపుతో ఊపందుకోనున్న విమానయానం పేపర్‌లెస్ ఈ–బోర్డింగ్ సౌకర్యం ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు గుర్తింపు సాధించింది. ►దేశీయ ప్రయాణంలో పూర్తి ఈ–బోర్డింగ్ సౌకర్యాన్ని కల్పించగా, అంతర్జాతీయంగా ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, ఎమిరేట్స్, గో ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ–బోర్డింగ్ సదుపాయాన్ని వినియోగంలోకి తెచ్చాయి. ►ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా క్యూ మేనేజ్మెంట్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. రద్దీ ప్రాంతాలపై డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఒకేచోట రద్దీ ఏర్పడకుండా నివారిస్తున్నారు. ►జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలు ‘హెచ్ఓఐ’ యాప్ తో భాగస్వామ్యాన్ని రూపొందించుకున్నాయి. దీంతో కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డర్లతోపాటు పేమెంట్ సౌకర్యాలను మొబైల్ ఫోన్ల ద్వారా ప్రయాణికులు పొందవచ్చు. ►భౌతిక దూరం నిబంధనలతోపాటు నిరంతర మాస్క్‌ల వినియోగం పర్యవేక్షణ మైక్‌ల ద్వారా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. ►టచ్‌లెస్ ఎలివేటర్లతోపాటు ఎక్కువగా వినియోగించే ట్రాలీలు, బెల్టులు ఇతర పరికరాలనూ శానిటైజ్ చేస్తున్నారు. -
బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మరో సదుపాయాన్ని రైల్వే అందుబాటులోకి తెచ్చింది. బయలుదేరవలసిన స్టేషన్ (బోర్డింగ్ పాయింట్)ను ఇక నుంచి ఆన్లైన్లో మార్చుకోవచ్చు. ఇప్పటివరకు రైల్వేస్టేషన్‌ల్లో మాత్రమే బోర్డింగ్ పాయింట్ మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ఇటీవల దీనిని ఆన్లైన్ పరిధిలోకి తెచ్చారు. దీంతో ప్రయాణికులు ట్రైన్ బయలుదేరే సమయానికి 24 గంటల ముందు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవచ్చు. అయితే ఇది నిర్ధారిత (కన్ఫర్మ్డ్) టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లకు ఈ సదుపాయం ఉండదు. ఒకసారి బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకున్న తరువాత తిరిగి అదే బోర్డింగ్ పాయింట్ నుంచి ప్రయాణం చేసేందుకు అవకాశం కూడా ఇవ్వరు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు మొదట సికింద్రాబాద్‌ను బోర్డింగ్ పాయింట్‌గా ఎంపిక చేసుకొని తరువాత కాజీపేట్‌కు మార్చుకున్న వాళ్లు అక్కడే రైలు ఎక్కాల్సి ఉంటుంది. సికింద్రాబాద్‌లో ఎక్కేందుకు అవకాశం ఉండదు. బోర్డింగ్ పాయింట్ మార్పుతో సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వరకు (అప్పటికే చార్జీలు చెల్లించి ఉన్నప్పటికీ) ప్రయాణం చేసేందుకు అనుమతించరు. ఆ రెండు స్టేషన్ల మధ్య వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు అవకాశాన్ని కల్పిస్తారు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు బెర్తుల లభ్యతకు అనుగుణంగా బోర్డింగ్‌ను మార్చుకునేందుకు ఆన్లైన్ సదుపాయం ఒక వెసులుబాటు కల్పిస్తుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దక్షిణమధ్య రైల్వే నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేప్రయాణికుల్లో సుమారు 10 శాతం నుంచి 12 శాతం వరకు ప్రతి రోజు బోర్డింగ్ పాయింట్ మార్పునకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ మార్పు సదుపాయం స్టేషన్లు, రిజర్వేషన్ కార్యాలయాల్లో మాత్రమే ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందిగానే ఉండేది. ఆన్లైన్ మార్పు వల్ల ఆ ఇబ్బంది తప్పినట్లైంది. వెయిటింగ్‌లిస్టు ప్రయాణికులకు అవకాశం... మరోవైపు నిర్ధారిత టికెట్లపైన బోర్డింగ్ పాయింట్ మార్చుకోవడంతో ఆ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణం కోసం వెయిటింగ్లో ఉన్న వాళ్లకు అవకాశం లభిస్తుంది. వికల్ప్ పథకం కింద టికెట్లు బుక్ చేసుకొని వెయిటింగ్లో ఉన్న వాళ్లకు తాము బుక్ చేసుకున్న ట్రైన్లో బెర్తులు లభించకపోయినా ఆ తరువాత వచ్చే రైళ్లలో ఇలాంటి బోర్డింగ్ మార్పుతో బెర్తులు లభించే అవకాశం ఉంది. ఇది ఇటు నిర్ధారిత టిక్కెట్ ప్రయాణికులకు, అటు వెయిటింగ్ లిస్టు వారికి ప్రయోజనకరం. ఇప్పటికే ఈ సదుపాయం ఉన్నప్పటికీ ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తేవడంతో ఎక్కువ మంది వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. -
విమాన బోర్డింగ్‌లో మార్పులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: త్వరలోనే విమానాల్లో బోర్డింగ్ పద్ధతి మారనుంది. ఇప్పటివరకు విమానాల్లో బోర్డింగ్ సీట్ నంబర్ల ఆధారంగా వరుస క్రమంలో ఉండేది. కానీ, మున్ముందు దీని స్థానంలో విమానంలో కిటికీ దగ్గర సీటు ప్రయాణికులు ముందు, ఆ తర్వాత మధ్య సీటు వారు, ఆ తర్వాత చివరి సీటు ప్రయాణికులు ఎక్కే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ విధానంలో విమానాల బోర్డింగ్ సమయం 35 శాతం వరకు తగ్గుతుందనేది నిపుణుల మాట. ‘‘అమెరికాలోని సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఈ విధానాన్నే పాటిస్తోంది. బోర్డింగ్ సమయాన్ని 10 ని.లకు తగ్గించి కంపెనీ లాభాల బాట పట్టింది’’ అని గ్రీన్‌టెక్ ఫౌండేషన్ తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారని, త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని విమానాశ్రయ భద్రత నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ’పై జరుగుతున్న రెండు రోజుల జాతీయ సదస్సులో పలువురు వక్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హెడ్ సేఫ్టీ తారీక్ కమల్ ఏమన్నారంటే.. విమానం గాల్లో ఉంటేనే లాభం.. విమానంలో గాల్లో ఉంటేనే డబ్బులు. బోర్డింగ్ కోసం సమయాన్ని వృథా చేస్తే కంపెనీకే నష్టం. విమానయాన కంపెనీలకు సమయం అనేది చాలా కీలకం. బోర్డింగ్, టేకాఫ్ ఎంత త్వరగా జరిగితే విమాన కంపెనీలకు అంత లాభం. విమానం ల్యాండింగ్ కాగానే వివిధ రకాల గ్రూప్‌లు, ఏజెన్సీల బాధ్యత ఉంటుంది. ప్రయాణికుల బోర్డింగ్ పాస్, చెకిన్, క్యూ, లగేజ్, కార్గో, ఇంధనం, ఆహారం, క్లీనింగ్, క్రూ, పైలెట్ ఎంట్రీ వంటివి ఉంటాయి. ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరిగిపోవాలి. బోర్డింగ్ సమయాన్ని తగ్గిస్తే.. నిర్వహణ వ్యయం తగ్గి విమాన కంపెనీ లాభాలు 0.43 శాతం పెరుగుతాయి. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో ఒక్క విమానం... ప్రయాణికులందరు ఎక్కి.. రన్‌వే మీదుగా టేకాఫ్ కావడానికి కనీసం 27 నిమిషాల సమయం పడుతోంది. విమానాశ్రయ కో–ఫౌండర్ టైంకి రాలేదని టేకాఫ్.. విమాన ల్యాండింగ్, టేకాఫ్‌లో కచ్చితమైన సమయపాలన పాటించడంతో ప్రపంచ విమానాశ్రయ పరిశ్రమలోనే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ది అగ్రస్థానం. ఏ ప్రముఖుల కోసం సౌత్ వెస్ట్ విమానాలు ఆగవు. ఒకసారి సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ కో–ఫౌండర్, మాజీ చైర్మన్ హెర్బ్ కెల్హర్ సమయానికి బోర్డింగ్ కాలేదు. ఆయన్ను గేట్ వద్దే వదిలేసి విమానం టేకాఫ్ అయింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రారంభంలో 4 విమానాలుండేవి. నిర్వహణ భారంతో ఒకటి విక్రయించింది. దీంతో ఉద్యోగులు బోర్డింగ్ సమయాన్ని తగ్గించి.. నాలుగో విమాన రూట్‌ని కూడా 3 విమానాలతో నడిపించగలిగే స్థాయికి తీసుకురాగలిగారు. -
ఎక్కాల్సిన రైల్వేస్టేషన్‌ను మార్చుకోవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) బుక్ చేసుకున్న టికెట్లో ఎక్కాల్సిన స్టేషన్‌ను మార్చుకునే వీలును కల్పించింది. ఈ ప్రకటనతో ఇక ప్రయాణీకులు చివరి సమయాల్లో అనువుగా ఉండే స్టేషన్‌కు ప్రయాణాన్ని మార్చుకోవచ్చు. సాధారణంగా టికెట్ బుకింగ్ సమయంలో మనం ఎక్కాల్సిన స్టేషన్, చేరాల్సిన స్టేషన్ వివరాలను ముందుగానే ఇస్తాం. అయితే, తాజా నిర్ణయంతో ప్రయాణీకులు ఎక్కాల్సిన స్టేషన్‌ను ప్రయాణ తేదీకి ఒక్కరోజు ముందు వరకూ మార్చుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సివుంటుంది. ఒక టికెట్‌పై ఒకసారి మాత్రమే మార్పులకు అవకాశం ఉంటుంది. కరెంట్ బుకింగ్, వికల్ప్, ఐ టికెట్ ద్వారా బుక్ చేసుకున్న వాటికి ఇది వర్తించదని ఐఆర్సీటీసి పేర్కొంది. స్టేషన్ మార్చుకోవాలంటే... ఐఆర్సీటీసీ యాప్‌లో బుకింగ్ హిస్టరీకి వెళ్లాలి. బుక్ చేసుకున్న టికెట్‌ను క్లిక్ చేయాలి. చేంజ్ బోర్డింగ్ పాయింట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఎక్కాల్సిన(మార్చుకోవాల్సిన) రైల్వేస్టేషన్‌ను ఎంచుకోవాలి. Want to #board #train from another #station but #ticket has been booked? Change your boarding station right from #IRCTC #eTicketing website. Just log on to https://t.co/s3mX8V8YUd or download IRCTC Rail Connect App:https://t.co/Rc3TO3JkVu pic.twitter.com/7tutd8W62r — IRCTC (@IRCTCofficial) April 27, 2018 -
ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానం
శంషాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో బోర్డింగ్ చేసుకున్న ప్రయాణికులకు కూడా ప్రయాణించే అవకాశం లేకుండా పోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే ఎయిర్‌లైన్స్ విమానాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం అర్ధరాత్రి, శుక్రవారం ఉదయం కూడా బోర్డింగ్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు విమానంలోకి ఎక్కకుండానే టేకాఫ్ తీసుకున్న సంఘటనలు జరిగాయి. గురువారం రాత్రి 10.28 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వయా బెంగళూరు మీదుగా ఢిల్లీ వెళ్లాల్సిన 6 ఈ 511 విమానంలో బోర్డింగ్ పూర్తి చేసుకున్న 25 మంది ప్రయాణికులు వెళ్లాల్సి ఉన్నా వారు ఎక్కకుండానే విమానం సమయానికి టేకాఫ్ తీసుకుంది. దీంతో ప్రయాణికులు రాత్రి ఒంటిగంట వరకు ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాచారు. తాము సమయానికి బోర్డింగ్ పూర్తి చేసుకున్నా విమానంలోకి ఎక్కకుండా గేట్ మూసివేశారని ఆరోపించారు. ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిన విమానంలో కూడా సుమారు 20 మంది ప్రయాణికులు బోర్డింగ్ పూర్తి చేసుకున్న తర్వాత విమానంలోకి ఎక్కకుండానే టేకాఫ్ తీసుకుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గత ఏప్రిల్‌లో శబరిమలై వెళ్లే పలువురు ప్రయాణికులు కూడా సుమారు రెండు రోజుల పాటు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. -
విమాన టికెట్ల రద్దు నిబంధనల మార్పు?
♦ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది: మంత్రి అశోక గజపతి ♦ వృత్తి నైపుణ్యాల శిక్షణ కోసం స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విమాన టికెట్ రద్దు, బ్యాగేజ్, బోర్డింగ్ వంటి అంశాల్లో కొత్త నిబంధనలు తేవాలని చూస్తోంది. టికెట్ రద్దు ఛార్జీలను ఈ మధ్య పలు విమానయాన సంస్థలు ఇష్టానుసారం పెంచేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ‘‘విమాన టికెట్ రద్దుకు సంబంధించి మాకు సలహాలు, సూచనలు, విన్నపాలు అందాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త నిబంధనలు తెస్తాం’’ అని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు చెప్పారు. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏవియేషన్ రంగంలో వృత్తి నైపుణ్యాల శిక్షణ నిమిత్తం.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), నేషనల్ స్కిల్ డె వలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ), నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎన్ఎస్డీఎఫ్) మధ్య ఈ సందర్భంగా ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఇందులో భాగంగా ఏఏఐ తన సీఎస్ఆర్ నిధులలో రూ.5.25 కోట్లను ఎన్ఎస్డీఎఫ్కు అందిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కూడా ఇస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ శాఖ కార్యదర్శి రోహిత్ నందన్ మాట్లాడుతూ.. వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి ప్రతి మంత్రిత్వ శాఖ కూడా కొన్ని ప్రణాళికలతో ముందుకు రావాలని తెలిపారు. భారత విమానయాన రంగంలో అత్యధికంగా 22 శాతం వృద్ధి నమోదయిందని, ప్రపంచంలోని ఏ ఇతర దేశమూ ఈ స్థాయి వృద్ధిని చూడలేదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనమే ఈ వృద్ధికి కారణమై ఉండొచ్చన్నారు. -
బోర్డింగ్ పూర్తయినా ప్రయాణికులను అనుమతించని ‘ఇండిగో’
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వయా బెంగళూరు మీదుగా కొచ్చిన్ వెళ్లాల్సిన 15 మంది ప్రయాణికులు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన ఉద్యోగుల వ్యవహారశైలితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ (413) విమానం గురువారం ఉదయం 7.15 గంటలకు టేకాఫ్ తీసుకుని బయలుదేరాల్సి ఉంది. ఈ విమానంలో కొచ్చిన్ వెళ్లేందుకు కొందరు ప్రయాణికులు అరగంట ముందుగానే విమానాశ్రయం లో చెక్ఇన్ పూర్తి చేయించుకుని బోర్డింగ్ పాస్‌లను తీసుకున్నారు. విమానంలోకి వెళ్లేందుకు వీరు బయలుదేరగానే అప్పటికే గేట్ మూసినట్లుగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో విమానం టేకాఫ్ తీసుకోవడంతో ప్రయాణికులంతా ఆందోళనకు దిగారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రయాణికులపట్ల దురుసుగా వ్యవహరించడంతోపాటు తక్కువ ధర టికెట్‌పై వెళ్తున్నారని, గ్రామీణులంటూ వెక్కిరించారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నలుగురు ప్రయాణికులు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌లైన్స్ వర్గాలు కూడా ఫిర్యాదును పోలీసులకు అందజేసినట్లు సమాచారం.