గుంటూరు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు నీటి విడుదలను ఆదివారం నిలుపుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 4.3 టీఎంసీలు విడుదల చేయాలని కృష్టా నదీ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున పది రోజల పాటు మొత్తం 4.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ మేరకు గత నెల 28 నుంచి సాగర్ జలాశయానికి నీటి విడుదల కొనసాగింది.
కుడికాలువ ఆయకట్టు పరిధిలోని గ్రామాలకు సాగునీటి అవసరాల నిమిత్తం బుగ్గవాగు రిజర్వాయర్‌కు 2.15 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1.4 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. ప్రస్తుతం బుగ్గవాగు రిజర్వాయర్‌లో 0.3 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇంకా 1.4 టీఎంసీలు రావాల్సి ఉండగా బోర్డు అధికారులు నీటిని కుడికాలువకు నిలుపుదల చేశారు. మరో ఎనిమిది రోజుల పాటు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున 16 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే బుగ్గవాగు రిజర్వాయర్‌కు 1.4టీఎంసీలు నీరు చేరుతుంది.
సాగర్ కుడి కాలువకు నీటి విడుదల నిలిపివేత
Published Sun, Sep 6 2015 8:05 PM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement
Advertisement