
హోల్డింగ్‌పాయింట్‌లో ఆగేవారేరి..?
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాపుష్కరాలకు వెళే ్లభక్తులను ఉద్ధేశించి ట్రాఫిక్‌ను నియంంత్రించేందుకు హోల్డింగ్ పాయంట్లను ఏర్పాటు చేశారు.
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాపుష్కరాలకు వెళే ్లభక్తులను ఉద్ధేశించి ట్రాఫిక్‌ను నియంంత్రించేందుకు హోల్డింగ్ పాయంట్లను ఏర్పాటు చేశారు. కానీ బోగారం శివారులోని మంజువనాథహోమ్స్‌కు చెందిన 10ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్‌లో గత మూడు రోజులుగా ఒక్క వాహనం కూడా ఆగలేదు. పుష్కరఘాట్లవద్ద ట్రాపిక్ సమస్య ఉత్పన్నం అయినప్పుడు ఎక్కడికక్కడ వాహనాలను ఆపడం హోల్డింగ్‌పాయింట్ల ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. స్థానికసీఐ ఎ.శ్రీ«ధర్‌రెడ్డి పర్యవేక్షణలో పోలీసుశాఖ వారు హోల్డింగ్ పాయింట్‌లో వాహనాలను నిలిపేందుకు బారీకేడ్లను నిర్మించారు. టూవీలర్స్, ఆటోలు, కార్లు, బస్సులు, ట్రక్కులు నిలిపేందుకు వేర్వేరుగా పార్కింగ్‌పాయింట్లను సిద్దంచేసి సూచికబోర్డులను పెట్టారు. ఎస్‌బీహెచ్‌వారి సహకారంతో స్టాపర్లను ఏర్పాటుచేశారు. సర్కిల్‌పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బంది షిప్ట్‌లవారిగా అక్కడ విధులను నిర్వహిస్తున్నారు. గ్రామీణ నీటిసరఫరావారు మంచినీటి వసతి ఏర్పాటుతోపాటు, మరుగుదొడ్లను నిర్మించారు. విద్యుత్‌శాఖవారు ఫోకస్‌లైట్లను అమర్చారు. ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో వైద్యసిబ్బంది నియమించడంతోపాటు, ప్రథమచికిత్సకు అవసరమైన మందులను సిద్దంగా ఉంచారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీకళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు భక్తులకు అవసరమైన సేవలను అందించడానికి కార్యోన్ముకులై ఉన్నారు.
ఒక్కవాహనం నిలిపితే ఒట్టు...
పుష్కరాలు ప్రారంభమై మూడురోజులు పూర్తయినప్పటికీ బోగారం హోల్డింగ్ పాయింట్‌వద్ద ఒక్కవాహనం కూడా ఆగలేదు. ఈనెల 12న వరలక్ష్మి వ్రతం, 13, 14, 15 తేదిలలో వరుస సెలవులు వచ్చినందున రద్దీబాగా ఉంటుందని అధికారులు బావించారు. కానీ ఇంతవరకు హోల్డింగ్‌పాయింట్‌లో ఎవరూ ఆగలేదు.