భీమ్‌గల్ (బాల్కొండ): మండలంలోని బడాభీమ్‌గల్ గ్రామంలో ఈ నెల 22న నిర్వహించ తలపెట్టిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు నిలిపి వేయించారు. గ్రామానికి చెందిన గంగారాం, లలిత దంపతులకు చెందిన బాలికకు ఈ నెల 22న వివాహం జరిపిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమాదేవి వీఆర్వో, అంగన్‌వాడీ టీచర్లను వెంట బెట్టుకుని శుక్రవారం వారి ఇంటికి చేరుకున్నారు.
బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పెళ్లిని నిలిపి వేయించారు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసుకున్న బాలికకు మానసికంగా, శారీరకంగా ఎదుగుదల ఉండదని, భవిష్యత్తులో ఎదురయ్యే శారీరక, కు టుంబ సమస్యల గురించి వారికి వివరించారు. చట్ట ప్రకారం కూడా బాల్య వివాహం శిక్షార్హమని హెచ్చరించారు. మైనారిటీ తీరే వరకు పెళ్లి చేయబోమని బాలిక తల్లిదండ్రులతో బాండ్ పేపర్ రాయించుకున్నారు. వరుడి కుటుంబ సభ్యుల కు కూడా ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. పెళ్లి రద్దు చేసి, బాలికను చదివించేందుకు ఎట్టకేలకు కుటుం బ సభ్యులు అంగీకరించారు.
బాల్య వివాహాన్ని నిలిపి వేయించిన అధికారులు
Published Sun, May 21 2017 1:48 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM
Advertisement
Advertisement