డిండి: మైనర్ బాలికకు పెద్దలు తలపెట్టిన వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలం రామంతాపూర్ గ్రామానికి చెందిన వేముల తిరుపతయ్య కుమార్తె(14) వివాహం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం గట్టుప్పల గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడితో నిశ్చయమైంది.
శుక్రవారం ఉదయం రామంతాపూర్‌లో పెళ్లి వేడుకకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీవో సక్కుబాయి, ఎస్సై శేఖర్ అక్కడికి వెళ్లి పెళ్లిని అడ్డుకున్నారు.రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ చేశారు. మైనారిటీ తీరకుండా బాలికకు వివాహం చేయటం నేరమని వారికి వివరించారు.