రైళ్లకు పై-లీన్ బ్రేక్
Published Sun, Oct 13 2013 4:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
ఆమదాలవలస, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను తాకిడితో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో రైల్వే లైన్లు దెబ్బతినడంతో శనివారం రావాల్సిన రైళ్లన్నీ రద్దయ్యాయి. పలాస-విశాఖపట్నం పాసింజర్ సర్వీసు (78531/78532), (58525/58526), (67293/67294)లను రద్దు చేశారు. భువనేశ్వర్-హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సికింద్రాబాద్ ఈస్ట్‌కోస్ట్, హౌరా-చెన్నై కోరమండల్, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా, భువనేశ్వర్-ముంబాయి కోణార్క్ ఎక్స్‌ప్రెస్, పూరీ-అహ్మదాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (18411/18412)ను, భువనేశ్వర్-తిరుపతి వెళ్లే (12879)వీక్లీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (67293) రద్దు చేసినట్లు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ రైల్వే అధికారులు తెలిపారు.పై-లీన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖాధికారులు శుక్రవారం నుంచే రైళ్ల సర్వీసులను క్రమబద్ధీకరించారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ (17015/16) విశాఖఎక్స్‌ప్రెస్‌ను విజయనగరం నుంచి నడుపుతున్నట్లు ప్రకటించి రద్దు చేశారు. పాట్నా-ఎర్నాకుళం (16310) వీక్లీ ట్రైన్ 3 గంటలు ఆలస్యంగా నడిచింది. గూడ్స్ ైరె ళ్లను శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లోనే నిలిపివేశారు.
ప్రయాణికుల ఇక్కట్లు
ైరె ళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్లాట్‌ఫారంపై అంధకారం అలముకుంది. రైల్వే బుకింగ్ వద్ద కూడా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయంవైపు దృష్టి సారించారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికుల సందడి లేక ప్లాట్‌ఫారం బోసిపోయింది.
పట్టాలపై చెట్లు
పలాస :పై-లీన్ తుఫాను ప్రభావంతో రైలు పట్టాలపై చెట్లు విరిగిపడడంతో రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం ఉదయం 9 గంటలకు పలాస స్టేషన్‌లో నిలిపేశారు. ఒడిశా తీరంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో అటు వైపు వెళ్లే రైళ్లు నిలిపివేసినట్లు పలాస రైల్వే స్టేషన్ మాష్టారు ఎం.శ్యామలరావు తెలిపారు. ఉదయం భువనేశ్వర్- బెంగుళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 9.30 గంటలకు పలాస నుంచి బయలుదేరిందన్నారు. హౌరా-చెన్నై మెయిల్ 11.40 గంటలకు, పాట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు 01.40 గంటలకు పలాస నుంచి బయలుదేరినట్లు ఆయన తెలిపారు.
Advertisement