భారీ టెక్ ఐపీఓగా లైన్ యాప్ | Biggest tech IPO of 2016: Japanese messaging app Line raises $1 billion | Sakshi

భారీ టెక్ ఐపీఓగా లైన్ యాప్

Published Tue, Jul 12 2016 12:27 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

భారీ టెక్ ఐపీఓగా లైన్ యాప్

భారీ టెక్ ఐపీఓగా లైన్ యాప్

టెక్ ఐపీఓలకు నిరుత్సాహకరమైన ఏడాదిగా ఉన్న 2016లో అతిపెద్ద టెక్ ఐపీఓకు తెరపడింది.

న్యూయార్క్ : టెక్ ఐపీఓలకు నిరుత్సాహకరమైన ఏడాదిగా ఉన్న 2016లో అతిపెద్ద టెక్ ఐపీఓకు తెరపడింది. జపాన్ లోని ప్రముఖ మెసేజింగ్ యాప్ లైన్, తొలి పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా 1.1 బిలియన్ డాలర్ల(రూ.6711కోట్లకు పైగా)ను సమీకరించింది. 3500లక్షల షేర్లను లైన్ ఈ పబ్లిక్ ఆఫర్ లో జారీచేసింది. ప్రణాళిక కంటే ఎక్కువగానే ఒక్కో షేరు 32.84 డాలర్ల ధరకు కొనుగోలు కావడంతో 2016లో అతిపెద్ద ఐపీఓగా లైన్ రికార్డులోకెక్కింది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ఐపీఓ అని ఐపీఓ రీసెర్చ్ సంస్థ రీనైజెన్స్ క్యాపిటల్ ప్రకటించింది. గత నెల 150 మిలియన్ డాలర్ల ట్విలియో ఐపీఓను లైన్ ఐపీఓ బీట్ చేసినట్టు రీసెర్చ్ సంస్థ తెలిపింది.

ఈ ఐపీఓతో న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లో ఎల్ ఎన్ గుర్తుతో, టోక్యో స్టాక్ ఎక్సేంజ్ లో 3938 గుర్తుతో కంపెనీ ట్రేడింగ్ ప్రారంభం కానుంది. లైన్ మెసేజింగ్ యాప్, దక్షిణ కొరియా అతిపెద్ద ఇంటర్నెట్ ఇంజెన్ దిగ్గజం నావర్ కార్పొరేషన్ కు చెందిన టోక్యో ఆధారిత కంపెనీ. ఉచిత మొబైల్ మెసేజింగ్, వాయిస్, వీడియో కాల్ సర్వీసులను ఈ పాపులర్ మెసేజింగ్ యాప్ ఆఫర్ చేస్తోంది. జపాన్ లో ట్విట్టర్, ఫేస్ బుక్ ల కంటే ఈ మెసేజింగ్ యాప్ ఎక్కువగా పాపులర్ అయింది. 2180లక్షల యూజర్లు లైన్ కు ఉన్నారు. అడ్వర్ టైజింగ్, మెసేజ్ లకు వాడే స్టాంపుల అమ్మకం ద్వారా లైన్ ఆదాయాలను ఆర్జిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement