కోనసీమ రైల్వేలైన్‌ వంతెన టెండర్లు రద్దు | konaseema rail way line | Sakshi
Sakshi News home page

కోనసీమ రైల్వేలైన్‌ వంతెన టెండర్లు రద్దు

Published Tue, Nov 1 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

కోనసీమ రైల్వేలైన్‌  వంతెన టెండర్లు రద్దు

కోనసీమ రైల్వేలైన్‌ వంతెన టెండర్లు రద్దు

 డిసెంబరులో కొత్తగా టెండర్లు 
అమలాపురం : కోనసీమ రైల్వేలైన్‌  బాలారిష్టాలు వీడడం లేదు. కోటిపల్లి నుంచి అమలాపురం మీదు నర్సాపురం వరకు సాగే ఈ రైల్వేలైన్ లో కీలకమైన గౌతమీ నదిపై వంతెన నిర్మాణానికి రైల్వేశాఖ పిలిచిన టెండరు రద్దయింది. ఈ నిర్మాణానికి సింగిల్‌ టెండరు పడగా, దీనికి సాంకేతిక అనుమతి లభించపోవడంతో రైల్వే శాఖాధికారులు రద్దు చేశారు. దశాబ్ధకాలంలో పెండింగ్‌లో ఉన్న కోనసీమ రైల్వేలేన్‌ కు గత బడ్జెట్‌లో గ్రీ¯ŒSసిగ్నల్‌ లభించిన విషయం తెలిసిందే. ఈ లైన్‌  నిర్మాణానికి రైల్వేశాఖ గత బడ్జెట్‌లో సుమారు రూ.270 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులను కోటిపల్లి వద్ద గౌతమీ నదిపై వంతెన నిర్మాణానికి కేటాయించారు. సుమారు 3.5 కిమీల నిడివిగల వంతెన నిర్మాణానికి జూలై24న టెండర్లు పిలిచారు. అయితే ఒక్క టెండరు మాత్రమే పడగా, దానికి సైతం సాంకేతిక అనుమతి లభించలేదు. దీంతో టెండరు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని రైల్వేశాఖాధికారులు నిర్ణయించారు. డిసెంబరు నెలాఖరు నాటికి టెండర్లు ఖరారవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టెండర్లలో ఎక్కువ కంపెనీలు పాల్గొనే అవకాశముందని రైల్వే శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.  సాంకేతిక కారణాలతో టెండరు రద్దు చేయడంపై రైల్వే ఉన్నతాధికారులతో అమలాపురం పార్లమెంట్‌ సభ్యుడు పండుల రవీంద్రబాబు మంగళవారం హైదరాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్త, రైల్వేఛీప్‌ ఇంజినీరు బ్రహ్మానందరెడ్డిలతో చర్చించి టెండరు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. 
కోనసీమ రైల్వేలైన్‌ కు సంబంధించి కోటిపల్లి నుంచి అమలాపురం నిర్మాణం జరిగే భట్నవిల్లి వరకు భూసేకరణ గతంలోనే పూర్తయింది. తాజాగా పేరూ రు వరకు సర్వే ఆరంభించగా, దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సర్వేను బోడసకుర్రు, వైనతేయ గోదావరి వరకు చేపట్టాలని ఇటీవల నిర్ణయించారు. ఇందుకు రైల్వేశాఖ రూ.45 కోట్లు కేటాయించింది. రెవెన్యూ, రైల్వే శాఖలు సంయుక్తంగా చేపడుతున్న ఈ సర్వే డిసెంబరు నెలాఖరుకు పూర్తయ్యే అవకాశముంది. కోటిపల్లి వద్ద వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవడం, మరోవైపు భూసేకరణకు సర్వే శరవేగంగా జరగడంతో రైల్వేలైన్‌ నిర్మాణ కల సాకారమవుతోందని కోనసీమవాసులు గంపెడాశతో ఉన్నారు. అయితే వంతెన టెండర్లు రద్దయ్యాయని తెలిసి వారు నిరాశ చెందుతున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement