‘ఉపాధి’ వేతనాలు నొక్కేశారు?
వెల్గటూరు : గ్రామీణ పేదలకు ఉపాధి కాల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నిధులు అధికారులు నిర్లక్ష్యంతో దుర్వినియోగం అవుతున్నాయి. కూలీలు శ్రమదోపిడీకి గురువుతున్నారు. మండలంలోని పైడిపెల్లి గ్రామానికి చెందిన సుమారు 500 మంది కూలీలు గ్రామంలో ఉపాధి పనులు చేశారు. చేసిన పనులను ఎఫ్‌ఏ రికార్డు చేసి ఈజీఎస్ కార్యాలయానికి పంపించారు. ఈమేరకు కూలీలకు వేతనాలు విడుదలయ్యాయి. కానీ వీటిని ఫినో సిబ్బంది కూలీలకు పంపిణీ చేయలేదు. దీంతో రూ.2.93 లక్షల వేతనాలు ఏడాదిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. కంచే చేను మేసినట్లుగా వేతనాల ఇచ్చే∙సీఎస్పీలే వాటిని నొక్కేశారని కూలీలు ఆరోపిస్తున్నారు. పెండింగ్‌లోని వేతనాల విషయంలో చర్యలు తీసుకోవాలస్సిన ఎంపీడీవో మీనమేషాలు లెక్కవేస్తున్నారు.
నిధులు దుర్వినియోగం
పైడిపల్లి గ్రామంలో ఈజీఎస్‌కూలీల వేతనాలు రూ.2.93 లక్షలు సీఎస్పీలే నొక్కేశారని ప్రజావేదికలో Ðð ల్లడయింది. వారం రోజుల్లో కూలీల పెండింగ్ వేతనాలు క్లీయర్ చేస్తానని ఏపీడీ అంజయ్యకు సీఎస్పీఅంజయ్య హామీ ఇచ్చారు. ఆ మేరకు కూలీల పెండింగ్ వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించకుండా 1.12 లక్షలు మాత్రమే చెల్లింపు చేశారు. మిగిలినవి పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో కూలీలు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫినో జిల్లా కోఆర్డినేటర్ వెకటేశ్వర్లు శనివారం సమస్య పరిష్కరిస్తారని ఈజీఎస్ ఏపీవో చంద్రశేఖర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.