రాకాసీపేట్‌లో నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్
సాక్షి, బోధన్: ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా రక్షిత తాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేరకు పనులు పురోగతిలో ఉన్నా, పట్టణంలో నత్తనడకన సాగుతున్నాయి. పనుల పురోగతిపై అధికా ర యంత్రాంగం శ్రద్ధ వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బోధన్ మున్సిపాలిటీ పరిధి లో చేపట్టిన పట్టణ మిషన్ భగీరథ పనులు నిలిచిపోయాయి. ఏడాది క్రితం పనులు ప్రారంభించిన పనుల్లో పురోగతి అంతంత మాత్రంగా నే ఉంది. భగీరథ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
రూ.10 కోట్లతో పనులు
పట్టణంలో మిషన్ భగీరథ పనులకు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో కేటాయించారు. ఈ నిధులతో మున్సిపల్ పాత వార్డుల్లో (35) అంతర్గత పైప్‌లైన్ సుమారు 24 కిలోమీటర్ల పొడవులో వేసేందుకు ప్రణాళిక ఉంది. దీంతో పాటు పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతంలోని మున్సిపల్ వాటర్‌వర్క్స్‌లో 5 లక్షల లీటర్ల సా మర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్, స్టంఫ్ ట్యాంక్, గంజ్ ప్రాంతంలో మరో 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓటర్ హెడ్‌ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఏడాది క్రిత మే పనులు చేపట్టారు. కానీ ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల పనులు సగం మేరకే పూర్తి చేశారు. స్టంఫ్ ట్యాంక్ నిర్మాణ పనులు పునాది దశలోనే ఉన్నా యి. అంతర్గత పైప్‌లైన్ పనులు 24 కిలోమీటర్లకు గాను 4 కిలోమీటర్ల మేరకే పూర్తి చేశారు. అంతర్గత పైప్‌లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ఈ పనుల పర్యవేక్షణను మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తోంది. ఈ పనులు నత్తననడకన సాగుతున్నా అధికార యంత్రాంగం పనుల పురోగతిపై సమీక్షించి, వేగవంతంగా పూర్తి చేయించడంలో చిత్తశుద్ధి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పనుల నతనడకన సాగుతుండడానికి గల కారణాలపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా
పట్టణ జనాభా అనధికారికంగా లక్షా పైనే ఉంటుంది. పట్టణ శివారులో 5 కిలోమీటర్ల దూరంలో గల బెల్లాల్ చెరువు పట్టణ ప్రజల త్రాగు, సాగునీటికి ముఖ్య జలవనరుగా ఉంది. ఈ చెరువు ద్వారా పట్టణ ప్రజలకు పైప్‌లైన్ ద్వారా రాకాసీపేట్‌లోని మున్సిపల్ వాటర్‌వర్క్స్‌కు పైప్‌లైన్ ద్వారా తీసుకొచ్చి, ఇక్కడ ఫిల్టర్ చేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో సుమారు 10 వేల కుళాయి కనెక్షన్‌లు ఉన్నాయి. రోజు 10 ఎంఎల్‌డీల తాగునీటి సరఫరా సాగుతోంది.
అయితే నాలుగు నెలలుగా రోజు విడిచి రోజు ఉదయం వేళ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 12 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల బెల్లాల్ చెరువులో ప్రస్తుతం 10 అడుగుల నీళ్లు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలను గుర్తించి రోజు విడిచి రోజు తాగునీటి సరాఫరా చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టణ తాగునీటి అవసరాల కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లతో నింపుతారు. ఈ ఏడాది నిజాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో తాగునీటి సరఫరాపై ప్రభావం పడనుంది.
వేగంగా విస్తరిస్తున్న పట్టణం
2009లో రూ. 22 కోట్లతో పట్టణ తాగునీటి పథకం ద్వారా పైప్‌లైన్, ఓవర్‌హెడ్‌ట్యాంక్‌ల నిర్మాణం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న పట్టణ విస్తరణ నేపథ్యంలో శివారు కాలనీలు, ఆయా వార్డుల్లో కాలనీల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు వస్తున్నాయి. తాగునీటి సమస్య ఎదురవుతున్న ఆయా వార్డుల పరిధిలోని కాలనీల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా అంతర్గత పైప్‌లైన్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి.
పనుల్లో జాప్యం వాస్తవమే..
పట్టణ మిషన్ భగీరథ పనుల పురోగతిలో జాప్యం జరుగుతున్న విషయం వా స్తవమే. అంతర్గపైప్‌లైన్ పనులు కొంత మేరకు పూర్తి చేశాం. వారం పది రోజుల్లో పనులు మళ్లీ మొదలవుతాయి. సత్వరంగా పనుల పూర్తికి దృష్టిసారిస్తాం.
– తిరుపతిరావు, ఈఈ, మున్సిపల్ పబ్లిక్‌అండ్‌హెల్త్ డిపార్ట్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment