Mission Bhagiratha works
-
నత్తనడకన.. పట్టణ మిషన్ భగీరథ
సాక్షి, బోధన్: ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా రక్షిత తాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేరకు పనులు పురోగతిలో ఉన్నా, పట్టణంలో నత్తనడకన సాగుతున్నాయి. పనుల పురోగతిపై అధికా ర యంత్రాంగం శ్రద్ధ వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బోధన్ మున్సిపాలిటీ పరిధి లో చేపట్టిన పట్టణ మిషన్ భగీరథ పనులు నిలిచిపోయాయి. ఏడాది క్రితం పనులు ప్రారంభించిన పనుల్లో పురోగతి అంతంత మాత్రంగా నే ఉంది. భగీరథ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రూ.10 కోట్లతో పనులు పట్టణంలో మిషన్ భగీరథ పనులకు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో కేటాయించారు. ఈ నిధులతో మున్సిపల్ పాత వార్డుల్లో (35) అంతర్గత పైప్‌లైన్ సుమారు 24 కిలోమీటర్ల పొడవులో వేసేందుకు ప్రణాళిక ఉంది. దీంతో పాటు పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతంలోని మున్సిపల్ వాటర్‌వర్క్స్‌లో 5 లక్షల లీటర్ల సా మర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్, స్టంఫ్ ట్యాంక్, గంజ్ ప్రాంతంలో మరో 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓటర్ హెడ్‌ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏడాది క్రిత మే పనులు చేపట్టారు. కానీ ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల పనులు సగం మేరకే పూర్తి చేశారు. స్టంఫ్ ట్యాంక్ నిర్మాణ పనులు పునాది దశలోనే ఉన్నా యి. అంతర్గత పైప్‌లైన్ పనులు 24 కిలోమీటర్లకు గాను 4 కిలోమీటర్ల మేరకే పూర్తి చేశారు. అంతర్గత పైప్‌లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ఈ పనుల పర్యవేక్షణను మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తోంది. ఈ పనులు నత్తననడకన సాగుతున్నా అధికార యంత్రాంగం పనుల పురోగతిపై సమీక్షించి, వేగవంతంగా పూర్తి చేయించడంలో చిత్తశుద్ధి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పనుల నతనడకన సాగుతుండడానికి గల కారణాలపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా పట్టణ జనాభా అనధికారికంగా లక్షా పైనే ఉంటుంది. పట్టణ శివారులో 5 కిలోమీటర్ల దూరంలో గల బెల్లాల్ చెరువు పట్టణ ప్రజల త్రాగు, సాగునీటికి ముఖ్య జలవనరుగా ఉంది. ఈ చెరువు ద్వారా పట్టణ ప్రజలకు పైప్‌లైన్ ద్వారా రాకాసీపేట్‌లోని మున్సిపల్ వాటర్‌వర్క్స్‌కు పైప్‌లైన్ ద్వారా తీసుకొచ్చి, ఇక్కడ ఫిల్టర్ చేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో సుమారు 10 వేల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. రోజు 10 ఎంఎల్డీల తాగునీటి సరఫరా సాగుతోంది. అయితే నాలుగు నెలలుగా రోజు విడిచి రోజు ఉదయం వేళ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 12 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల బెల్లాల్ చెరువులో ప్రస్తుతం 10 అడుగుల నీళ్లు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలను గుర్తించి రోజు విడిచి రోజు తాగునీటి సరాఫరా చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టణ తాగునీటి అవసరాల కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లతో నింపుతారు. ఈ ఏడాది నిజాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో తాగునీటి సరఫరాపై ప్రభావం పడనుంది. వేగంగా విస్తరిస్తున్న పట్టణం 2009లో రూ. 22 కోట్లతో పట్టణ తాగునీటి పథకం ద్వారా పైప్‌లైన్, ఓవర్హెడ్ట్యాంక్ల నిర్మాణం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న పట్టణ విస్తరణ నేపథ్యంలో శివారు కాలనీలు, ఆయా వార్డుల్లో కాలనీల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు వస్తున్నాయి. తాగునీటి సమస్య ఎదురవుతున్న ఆయా వార్డుల పరిధిలోని కాలనీల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా అంతర్గత పైప్‌లైన్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. పనుల్లో జాప్యం వాస్తవమే.. పట్టణ మిషన్ భగీరథ పనుల పురోగతిలో జాప్యం జరుగుతున్న విషయం వా స్తవమే. అంతర్గపైప్లైన్ పనులు కొంత మేరకు పూర్తి చేశాం. వారం పది రోజుల్లో పనులు మళ్లీ మొదలవుతాయి. సత్వరంగా పనుల పూర్తికి దృష్టిసారిస్తాం. – తిరుపతిరావు, ఈఈ, మున్సిపల్ పబ్లిక్అండ్హెల్త్ డిపార్ట్మెంట్ -
పనులెందుకు జరుగుతలేవ్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ ధర్మారం: కింది స్థాయిలో కొత్తగా చేరిన ఇంజనీర్‌కు బడితె పూజ చేస్తే తప్ప అప్పగించిన పనులు పూర్తి కావనుకున్నాడో ఏమో ఆ అధికారి. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే చండశాసనుడైన అధికారి ఎవరినీ ఉపేక్షించడు అనే సందేశాన్ని ఇతర అధికారులకు కూడా పంపించాలనుకున్నాడు ఆ సారు. ఇంకేముంది కర్రతో వాతలు పెట్టే పని మొదలుపెట్టి.. ఆ ఘన కార్యాన్ని వీడియో సైతం తీయించారు! అది కాస్తా వైరల్ అవడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత శాఖ సిబ్బంది కథనం ప్రకారం.. మండలంలోని మేడారం, ధర్మారం, బొమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈఈ తిరుపతిరావు నందిమేడారం గ్రామంలో కొనసాగుతున్న పనుల పరిశీలనకు వెళ్లారు. నందిమేడారంలోని ఆలయం వద్ద పైప్‌లైన్‌కు, ట్యాంకు మధ్య ఇంటిగోడ ఉండటంతో పైప్‌లైన్ లింకేజీ పని పూర్తి కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈఈ.. కాంట్రాక్టర్‌ను పిలిపించి ఆయన సమక్షంలోనే పైప్‌లైన్ లింక్ ఎందుకు పూర్తి చేయలేదని ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను కర్ర తీసుకురావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న మహిళా వర్క్ ఇన్స్పెక్టర్ని పిలిచి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరణ చేయాలని అన్నారు. ఆమె వీడియోలో చిత్రీకరిస్తుండగా, ఎందుకు పనులు చేయించడం లేదని కర్రతో తొడలు, మోకాళ్లపై కర్రతో గట్టిగా కొట్టారు. దీంతో భయాందోళనకు గురైన ఏఈ విలాస్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అక్కడే ఉన్న డీఈఈ రాజ్కుమార్పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లిస్తున్నా పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. సమాధానాలు చెబుతున్నా వినిపించుకోకుండా చేతిలో కర్రను ఊపుతూ ఈఈ చేస్తున్న హంగామాను డీఈ సైతం ఆశ్చర్యంగా చూడటం గమనార్హం. అక్కడ నుంచి ధర్మారంలోని మసీద్ వద్దకు వచ్చి పైప్‌లైన్ లింక్ ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా.. లింక్ చేసే అనుభవమున్న మెకానిక్‌లు దొరకటం లేదని సమాధానం చెప్పినప్పటికీ వినకుండా తిట్ల వర్షం కురిపించినట్లు సమాచారం. ధర్మారం నుంచి బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి కిందిస్థాయి అధికారిని కారులోనే తీసుకువెళ్లి అక్కడ కూడా పనుల జాప్యంపై ఆగ్రహించారు. కాగా ఆయా గ్రామాల్లోని కాంట్రాక్టర్లకు ఎన్ని సార్లు చెప్పినప్పటికి స్థానికంగా నెలకొన్న వివిధ సమస్యలతో పనులు ముందుకు సాగటం లేదని ఏఈ చెప్పినా వినిపించుకోకుండా మందలించినట్లు సమాచారం. అక్కడి నుంచి తిరిగి వారిని పెద్దపల్లికి తీసుకువచ్చినట్లు ఏఈ తెలిపారు. కొత్తగా ఏఈగా ఉద్యోగంలో చేరిన విలాస్ తనకు జరిగిన అవమానానికి మనస్తాపానికి గురై అదే రాత్రి యూనియన్ నాయకులకు సమాచారం అందించారు. మంగళవారం యూనియన్ నాయకులతో కరీంనగర్లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని కలసి ఈఈ చేసిన నిర్వాకాన్ని, తన తొడలపై వచ్చిన వాతలను చూపించి ధర్నా నిర్వహించారు. ఈఈ చేసిన బడితెపూజపై అధికార యంత్రాంగంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 20,093 కోట్లు, పంచాయతీరాజ్ విభాగం కింద రూ. 10,716 కోట్లు కేటాయించాలని ఆయా శాఖలు ప్రభుత్వాన్ని కోరగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో భాగంగా గ్రామీణాభివృద్ధికి రూ. 5,358 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖకు రూ. 4,221 కోట్లను సర్కారు ప్రతిపాదించింది. 2018–19 బడ్జెట్లో ఈ శాఖకు రూ. 15,562 కోట్లు (పీఆర్ విభాగానికి రూ. 8,929 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 6,633 కోట్లు) కేటాయించింది. మరోవైపు గత బడ్జెట్లో ఆసరా పింఛన్ల కింద రూ. 5,388 కోట్లు కేటాయించగా దానికంటే రెండింతలు అధికంగా తాజా బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ. 12,067 కోట్లకు ప్రభుత్వం పెంచింది. ఇక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథకు ప్రత్యక్ష కేటాయింపులు పెద్దగా కనిపించలేదు. గతేడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ. 1,803 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం స్పష్టమైన కేటాయింపులు చేసినట్లు కనబడలేదు. అయితే పీఆర్, ఆర్డీకి సంబంధించి వివిధ రంగాలు, పథకాల కింద పలు రూపాల్లో కేటాయింపులు చేసినందున వాటిలోంచి మిషన్ భగీరథకు కేటాయించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకున్న దశలో బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. 2017–18 బడ్జెట్లో ఈ పథకానికి ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు కేటాయించింది. కాగా, అటవీ, పర్యావరణ, విజ్ఞానం, సాంకేతిక నైపుణ్య శాఖకు రూ. 342 కోట్లు కేటాయించాలని అధికారులు కోరగా ప్రభుత్వం మాత్రం రూ. 171 కోట్లకే బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. ‘డబుల్’ స్పీడ్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ అంశాన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.2,643 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల్లోపు 80 వేల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఈ సారి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 2019–20 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్లో రూ.4,709.5 కోట్లు కేటాయించింది. దీంతో ఈ సారి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగనుంది. 2019 జనవరి వరకు మొత్తం 19,195 ఇళ్లను ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. వీటికి ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. పెళ్లికి సాయం పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఒక్కో లబ్ధిదారుకు రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. తాజాగా ఈ పథకాలకు 2019–20 బడ్జెట్లో రూ. 1,450 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 1.433 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ రెండు పథకాలకు రూ. 1,400 కోట్లు కేటాయించింది. కాగా, ఈ పథకాలకు ఈ నెల 20 నాటికి 2.25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో జనవరి నెలాఖరు నాటికి 1,29,742 మందికి ఆర్థిక సాయం అందించారు. 2014–15లో కల్యాణలక్ష్మి పథకాన్ని ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అమలు చేయగా.. 2016–17 వార్షిక సంవత్సరం నుంచి బీసీ, ఈబీసీలకూ అందిస్తోంది. ఆర్టీసీకి నిరాశే.. రాష్ట్ర ఆర్టీసీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న అప్పులు, వాటి వడ్డీలతో సంస్థపై ఆర్థికభారం పెరిగిపోతోంది. అయితే ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో సైతం ఆర్టీసీకి నిరాశే ఎదురైంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.630 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులో వివిధ బస్సుపాస్‌లు ఇతర రాయితీల కింద రూ.520 కోట్లు వివిధ రీయింబర్స్‌ల కింద పోను, మిగిలిన రూ.110 కోట్లను రుణాల కోసం కేటాయించారు. కొత్త బస్సుల కొనుగోలుకు ఇందులోనే సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బడ్జెట్లో ప్రకటించిన మొత్తాన్ని ఏనాడూ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం గమనార్హం. గతేడాది రూ.975 కోట్లు కేటాయించిన సర్కారు ఈ సారి ఏకంగా రూ.345 కోట్ల కోత విధించింది. -
పరమేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలి
చిన్నకోడూరు(సిద్దిపేట) : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే పరమేశ్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు సోమవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనుల వద్ద ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర పరమేశ్(27) కూలి. ఈనెల 10వ తేదీ రాత్రి పనులు ముగించుకుని బైక్‌పై గంగాపూర్‌కు వెళ్తుండగా చంద్లాపూర్ శివారులో కల్వర్టు నిర్మాణ పనులు జరిగే చోట రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న గుంతలో పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కాంట్రాక్టర్ కల్వర్టు నిర్మాణ పనుల్లో జాప్యం చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతుడి బంధువులు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులు జరిగే వద్ద ఆందోళనకు దిగారు. ఏడాది పాటు గుంత తీసి.. నెమ్మదిగా పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు. పనులు వేగంగా జరిగి ఉంటే పరమేశ్ ప్రమాదానికి గురయ్యేవాడు కాదని చెప్పారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే జరిగిన ఈ ప్రమాదం మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు ఎస్సై అశోక్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడినా ఫలితం లేదు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లిస్తామని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. -
15 రోజుల్లో మిషన్ భగీరథ నీరు అందిస్తాం
-
‘భగీరథ’ పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, మరిపెడ(వరంగల్): మిషన్ భగీరథ పనులను గడువులోగా పూర్తి చేసి ఈనెల 26న ట్రయల్ రన్ చేయాలని భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం ఎదళ్లగుట్ట వద్ద కొనసాగుతున్న మిషన్ భగీ రథ పనులపై శనివారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 24 వేల పై చిలుకులు గ్రామాలకు శుద్దీచేసిన నీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కే సీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అబ్బాయిపాలెం నుంచి పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్‌తో పాటు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలానికి నీటి ని అందించనున్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.1,700 కోట్లు ఖర్చు అంచనా వేసినట్లు తెలిపారు. అయితే అన్నింకంటే ముందుగా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, నర్సింహులపేట, కురవి, డోర్నకల్ మండలాలకు ఈనెల 15 వరకుభగీర«థ నీరందుతుందన్నారు. ఎదళ్లగుట్ట వద్ద జరుగుతున్న పనులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన పైపులైన్ పనులు 25 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి వారం రోజుల్లో పూర్తవుతాయన్నారు. అధికారులపై మండిపాటు.. బొడ్లాడ వద్ద జరుగుతున్న పనుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావద్దని హెచ్చరించారు. అలాగే పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న పనులు ఈనెల 8 వరకు పూర్తి చేస్తామని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్, ధర్మసాగర్, జనగామలో ఈనెల 30లోగా పూర్తవుతాయని, అయితే ఇక్కడ పైప్‌లైన్ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఇది సహించే విషయం కాదని చైర్మన్ మందలించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వేరే వారిని పెట్టుకుని పనులు చేయించుకుంటామని హెచ్చరించారు. ఏటూరునాగారం వద్ద జరుగుతున్న పనుల్లో ఎలక్ట్రోమెకానిక్ వర్క్స్ ఇంత వరకు పనులు ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఈనెల 15 వర కు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు, అధికారులకు చెప్పా రు. జనగామ 180 ఇంట్రా విలేజ్‌లో పనులు కావాల్సి ఉందన్నారు. యాదాద్రిలో 569 పనులకు 207 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇవన్ని ఈ నెల 20 వరకు పూర్తిచేస్తామని సమీక్షలో వెల్లడించారు. అధికారులకు స్వాగతం... మరిపెడ శివారులోని ఎస్సీ గురుకులం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలంలో భగీరథ వైస్ చైర్మ న్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎం కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్ దిగారు. ఈ సందర్భంగా వారికి మం త్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్వాగతం పలికారు. ఏ రోజు నివేదిక ఆ రోజు ఇవ్వాలి.. ఈనెల 26న మిషన్ భగీరథ ట్రయల్ రన్ చేయాల్సిందేనని సీఎం కార్యాలయం సెక్రటరీ స్మితా సబర్వాల్ అన్నారు. కొంత మంది అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అది సరైందని పద్ధతి కాదన్నారు. అ«ధికారులు సమన్వయంగా పనిచేయాలని ఆమె సూచించారు. ప్రతి రోజు 24 గంటలు పనిచేసి గడువులోగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. రేపటిలోగా ఎప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో నివేదిక తీసుకో వాలని సీఎంసీ సురేంద్రరెడ్డికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పనుల ను గడువులోగా పూర్తి కాకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, ప్రభుత్వ సలహదారుడు జ్ఞానేశ్వర్, జనగామ ఇన్చార్జి కలెక్టర్ అనితా రాంచంద్రన్, మహబూబాబాద్ జిల్లా జేసీ దామోదర్‌రెడ్డి, గుడిపుడి నవీన్, డి.ఎస్ రవిచంద్ర, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మెగా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
భగీరథ’ పనుల్లో అపశ్రుతి
కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పంప్‌హౌస్ పైకప్పు శనివారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొల్లాపూర్ నియోజకవర్గానికి తాగు నీరు అందించేందుకు ఎల్లూరు సమీపంలో పంప్‌హౌజ్, ఫిల్టర్‌బెడ్స్, సంప్‌వెల్ నిర్మిస్తున్నారు. నెలాఖరులోగా పూర్తిచేసి ట్రయల్‌రన్ నిర్వ హించాలనే లక్ష్యంతో అధికారులు వేగం పెంచారు. ఈ పనుల్లో ఎల్లూరు, బుసి రెడ్డి పల్లి గ్రామాలకు చెందిన 40 మంది కూలీలు పాల్గొన్నారు. పనులు కొంతమేర చేపట్టిన వెంటనే శ్లాబ్ కోసం కట్టిన ఇనుప కడ్డీలు కుప్పకూలాయి. దీంతో కప్పు నిర్మాణ పనుల్లో ఉన్న కూలీలు దాదాపు 30 ఫీట్ల లోతులోకి పడిపోయారు. నక్క గౌరమ్మ, ఆకునమోని కుర్మయ్య, చింతల కృష్ణ, బుసిరెడ్డిపల్లికి చెం దిన సుజాత, రవి, తాళ్ల చెన్నమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్ప త్రికి, హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకువెళ్లారు. కాగా, ప్రాజెక్టు సీఈ కృపాకర్‌రెడ్డి ఎల్లూరుకు వచ్చి వెళ్లి తర్వాత కొన్ని గంటలకే ఈ ప్రమా దం చోటుచేసుకోవడం గమనార్హం. -
‘మిషన్ భగీరథ’ వేగవంతం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసి సురక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఈ నెల 2, 3 న జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపై అధికారులతో సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో మిషన్ భగీరథ పనుల్లో అలసత్వంపై ఆయన అసంతృప్తిని కూడ వ్యక్తం చే శారు. మిషన్ భగీరథ పనుల వేగం పెంచేందుకు సీఎం కార్యాలయపు అదనపు కార్యదర్శి స్మితసబర్వాల్ను ప్రత్యేక పర్యవేక్షణ కోసం పంపిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతోసమావేశం నిర్వహించి పనుల వేగం పెంచారు. ఇదే సమయంలో మిషన్ భగీరథ పనులు నిర్దేశిత లక్ష్యం ప్రకారం పూర్తయ్యేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ మంగళవారం మెదక్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు రొనాల్డ్‌రోస్, డాక్టర్ యోగితారాణాలు, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థల నిర్వాహకులతో కలిసి పనులను పరిశీలించారు. మెదక్, నిజామాబాద్‌లో పనుల పరిశీలన.. జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.1300 కోట్ల అంచనాతో మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు సమీపంలో పెద్దరెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్ వెల్, వాటర్ గ్రిడ్ ట్రిట్మెంట్ ప్లాంట్, పంపింగ్ వెల్ పనులను స్మిత సబర్వాల్ తనిఖీ చేశారు. అనంతరం బాల్కొండ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్‌తో జలాల్పూర్ వద్ద నిర్మించే మిషన్ భగీరథ పనులను సబర్వాల్ పరిశీలించారు. ఇన్‌టెక్ వెల్, పంపింగ్ హౌస్, రోజుకు 14 కోట్ల లీటర్ల సామర్థ్యం గల మూడు వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 1350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆమె తెలిపారు. జలాల్పూర్ ఇన్‌టెక్ వెల్‌కు అనుసంధానంగా అర్గుల్ వద్ద రోజుకు 6 కోట్ల లీటర్లు, ఇందల్వాయి వద్ద రోజుకు 4 కోట్ల లీటర్లు, మల్లన్నగుట్ట వద్ద రోజుకు 4 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ట్రిట్మెంట్ ప్లాంట్ల పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు. వీటికి తోడుగా గతంలో ఈ ప్రాంతంలో నిర్మించిన ఒక్కొక్కటి 3 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన 3 వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్లకు జలాల్పూర్ వద్ద నిర్మించే ఇన్‌టెక్ వెల్ నుంచి నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జలాల్పూర్ ఇన్‌టెక్ వెల్ నుంచి 20 మండలాల్లోని 860 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇంటింటికీ సురక్షిత నీరు.. స్మిత సబర్వాల్‌తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జగన్మోహన్రెడ్డి, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మితసబర్వాల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు రాష్ట్రానికే తలమానికం కావాలన్నారు. నిర్ణీత కాలంలో నిర్దేశించిన గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రధాన పనులతో పాటు గ్రామాలలో ఇంటింటికి అనుసంధానం చేసే పైపులైన్ల పనులను కూడా ఏకకాలంలో చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పైపులైన్ల నిర్మాణపు పనులను మే నెలాఖరులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులకు నష్టం జరగరాదన్నారు. పెద్దరెడ్డిపేట వద్ద నిర్మించే వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు 14 కోట్ల 50 లక్షల లీటర్లు ఉందని తెలిపారు. పెద్దరెడ్డి పేట నుంచి 5.25 కిలో మీటర్లు దూరంలో ఉన్న తడమనూరు (మెదక్ జిల్లా)కు 100 మీటర్ల ఎత్తున పంపింగ్ చేయనున్నట్లు తెలిపారు. తడమనూరు నుంచి గ్రావిటి ద్వారా జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజక వర్గాలలోని అన్ని గ్రామాలతో పాటు బోధన్ మున్సిపాలిటీకి, ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని కొన్ని గ్రామాలకు సింగూరు జలాలను శుద్ధిచేసి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 16 మండలాల్లోని 785 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయడం లక్ష్యమన్నారు. 2017 జూన్ నాటికి 213 గ్రామాలకు, 2017 డిసెంబరు నాటికి 512 గ్రామాలకు సింగూరు జలాలు అందుతాయని తెలిపారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయించేందుకు ప్రభుత్వం రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.