ప్రైవేట్ పాఠశాలలకు ఇక ట్రేడ్‌లెసైన్‌‌సలు | Private schools in the Trade lesain | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ పాఠశాలలకు ఇక ట్రేడ్‌లెసైన్‌‌సలు

Published Thu, May 8 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

Private schools in the Trade lesain

  •      ఉత్తర్వులు జారీచేసిన కమిషనర్
  •      బల్దియాకు కాసుల పంట
  •  కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వరంగల్ నగర పాలకసంస్థ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలకు ట్రేడ్ లెసైన్స్ తప్పనిసరి చేశారు. పాఠశాల గుర్తింపు రెన్యూవల్ సమయంలో బల్దియా నుంచి పొందే నిరభ్యంతర పత్రంతోపాటు ట్రేడ్ లెసైన్స్ జారీ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది ఆ దిశగా ముందుకు సాగుతున్నాయి.

    వరంగల్ నగరంతోపాటు 42 విలీన గ్రామాల్లో 300 వరకు గుర్తింపు కలిగిన పాఠశాలలున్నాయి. మరో 50 వరకు అనధికారిక పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు కూడా తప్పనిసరిగా ట్రేడ్ లెసైన్స్ తీసుకోవాలని గతంలో నిబంధన ఉంది. దీనిని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వ్యతిరేకించాయి. తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని బల్దియా అధికారులు స్పష్టం చేశారు. దీంతో వడుప్సా ఆధ్వర్యంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.

    ఈ క్రమంలో ట్రేడ్ లెసైన్స్ వ్యవ హారం పెండింగ్‌లో ఉంది. కొద్దినెలలుగా ట్రేడ్ లెసైన్స్ అంశం మళ్లీ తెరమీదికొచ్చింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రతి ఐదేళ్లకోమారు గుర్తింపు కోసం రెన్యూవల్ చేసుకుంటాయి. ఇందుకు శానిటేషన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) జిల్లా విద్యాశాఖ అధికారికి జతపరిచి సమర్పించాలి. గతంలో ఉన్న శానిటరీ సర్టిఫికెట్ తీసుకోకుండా ఏదో ఒక రకంగా మేనేజ్ చేసేవారు. శానిటరీ సర్టిఫికెట్ ఇప్పడు తప్పనిసరి చేయడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బల్దియా బాట పట్టాయి. శానిటేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

    దీంతో బల్దియా అధికారులు శానిటరీ సర్టిఫికెట్ జారీ చేయాలంటే కచ్చితంగా ట్రేడ్ లెసైన్స్ ఫీజు చెల్లించాలని లింకు పెట్టారు. అయినప్పటికీ కొంత మంది లెసైన్స్ ఫీజు చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. కానీ, గతంలో మూడు నుంచి ఐదేళ్ల పాటు ఉన్న లెసైన్స్ బకాయిలు చెల్లించాలని నిబంధన పెడుతున్నారు.

    దీంతో యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ప్రైవేట్ పాఠశాలలకు తప్పనిసరిగా ట్రేడ్ లెసైన్స్ జారీ చేయాలని ఇటీవల మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సువర్ణ పండాదాస్ ఎంహెచ్‌ఓ ధన్‌రాజ్‌కు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో కొంత మంది యజమానులు పెండింగ్ బకాయిలను చెల్లించి శానిటరీ సర్టిఫికెట్‌తోపాటు ట్రేడ్ లెసైన్స్ పొందుతున్నారు. దీంతో బల్దియాకు ప్రైవేట్ పాఠశాలల నుంచి ట్రేడ్‌లెసైన్స్ రూపంలో ఆదాయం సమకూరుతోంది.
     
    సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తారంటే...
     
    ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల సంఖ్య, గదుల సంఖ్య, లెక్కిస్తారు. అక్కడి పరిస్థితులకు విద్యార్థులకు అనుకూలంగా మరుగుదొడ్లు ఉన్నాయా లేదా ఇబ్బందికరంగా ఉన్నాయా అనేది ప్రజారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పరిశీలించాల్సి ఉంటుంది. నగరంలోని చాల పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. ఇరుకు గదులు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటుంది.
     
    విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎక్కడ కూడా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయడం లేదు. పాఠశాలలు ఇచ్చిన నమూనాలను చూసి రేటు నిర్ణయించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో పాఠశాలల చుట్టు పక్క నివాసాల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. పాఠశాల వాస్తవికత ఆధారంగా శానిటరీ సర్టిఫికెట్ జారీ చేస్తే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు.
     
     ట్రేడ్ లెసైన్స్ తీసుకోవాలి
     బల్దియా పరిధిలోని ప్రతి ప్రైవేట్ పాఠశాల తప్పనిసరిగా శానిటేషన్ సర్టిఫికెట్‌తోపాటు ట్రేడ్ లెసైన్స్ తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం.
     - ధన్‌రాజ్, ఎంహెచ్‌ఓ
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement