న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కలిపి ఐదు కోట్లకుపైనే కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. శుక్రవారం(జులై 26) లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. ఐదు కోట్లకు పైగా పెండింగ్ కేసుల్లో సుప్రీంకోర్టులో 85వేలు, వివిధ హైకోర్టుల్లో 60 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
అత్యధికంగా జిల్లా స్థాయి, అంతకంటే దిగువకోర్టుల్లోనే 4కోట్ల54లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కోర్టుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, న్యాయపరమైన చిక్కులు ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్ పడుతున్నాయని తెలిపారు. అత్యంత ఎక్కువగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్ ప్రదేశ్‌లోని కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment