న్యాయస్థానాల్లో ‘పెండింగ్‌’ భారం ఎంత? | How Many Cases Are Pending In The Courts Of The Country? Which Court Has High Cases? - Sakshi
Sakshi News home page

న్యాయస్థానాల్లో ‘పెండింగ్‌’ భారం ఎంత?

Published Sat, Feb 17 2024 7:24 AM | Last Updated on Sat, Feb 17 2024 10:20 AM

4 Lakh 47 Crore Cases Pending Courts - Sakshi

దేశంలోని పలు కోర్టుల్లో లెక్కకుమించిన కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయనే విషయం విదితమే. అయితే  నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజి) అందించిన తాజా సమాచారం చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. 

దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 25 హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టు 10.74 లక్షల కేసులతో ముందుంది. దీని తర్వాత బాంబే హైకోర్టులో 7.13 లక్షల కేసులు, రాజస్థాన్ హైకోర్టులో 6.67 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జీడీజీ) అందించిన తాజా డేటాలో ఈ వివరాలు ఉన్నాయి. 2018 నుంచి పెండింగ్ కేసుల సంఖ్య పెరిగింది. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసులు 50.95 శాతం మేరకు పెరిగాయి. బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు 53.85 శాతం మేరకు పెరిగాయి.

అన్ని హైకోర్టుల్లో మొత్తం 62 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 71.6 శాతం సివిల్ కేసులు, 28.4 శాతం క్రిమినల్ కేసులు. 2018 నుంచి ఈ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరిగింది. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్ల క్రితం నాటివి. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 18.25 శాతం కేసులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.

పలు నివేదికల ప్రకారం పెండింగ్‌లో ఉన్న కేసులకు న్యాయమూర్తుల సంఖ్య సరిపోకపోవడమే ప్రధాన కారణం. 2022 మే నాటికి దాదాపు 25,600 మంది న్యాయమూర్తులు నాలుగు కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించే లేదా తీర్పునిచ్చే  పనిలో ఉన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement