
సాక్షి, విజయవాడ : పట్టణంలోని మహాత్మాగాంధీ రోడ్డులోని పాత కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయానికి సంబంధించిన కరెంట్ బిల్లు చెల్లించకుండా తెలుగు దేశం నేతలు వెళ్లిపోయినట్లు యజమాని పొట్లూరి శ్రీధర్ తెలిపారు. రెండు నెలల నుంచి కరెంట్ బిల్లుల గురించి వారి వెంట తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేదని శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. కరెంట్ బిల్లు లక్షల రూపాయల బకాయిలు ఉంటే విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎందుకు ఊరుకున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు శ్రీధర్.
ఇప్పటికైనా టీడీపీ నేతలు విద్యుత్ బకాయి బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడతానని శ్రీధర్ హెచ్చరిస్తున్నారు. గతంలో టీడీపీ ఆఫీసు లీజు విషయంలో కూడా లక్షలాది రూపాయలు పెండింగ్ పెట్టి చివరకు విజయవాడకు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలతో సెటిల్ మెంట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment