మాట్లాడుతున్న ఇంచార్జి కలెక్టర్ దివ్య
-
వీడియో కాన్ఫెరెన్స్‌లో తహసీల్దార్లను ఆదేశించిన ఇన్‌చార్జ్ కలెక్టర్ దివ్య
ఖమ్మం జెడ్పీసెంటర్: షాదీముబారక్,కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ దివ్య తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫెరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ అసైన్డ్ భూములకు సంబంధించి తహసీల్దార్లు సమర్పించిన సమచారం మేరకు భౌతికంగా క్షేత్ర స్థాయిలో తహసీల్దార్లు, సర్వేయర్లు, డీటీలు, ఆర్‌ఐలు తనిఖీ చేయాలన్నారు. సాదాబైనామాలకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినా నోటీసులు జనరేట్ చేయలేదని వెంటనే వాటి గురించి చర్యలు తీసుకోవాలన్నారు. భూదాన్ భూములకు సంబంధించి పోజిషన్ వెరిఫికేషన్ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ వివరాలకు సంబంధించి సబ్‌రిజిస్టర్, తహసీల్దార్‌లు ఏకికత మ్యాన్‌వల్ మార్పుల చేర్పులకే వచ్చిన దరఖాస్తులను విచారణ చేసి రెవెన్యూ సేవలకు సంబంధించిన మ్యూటేషన్‌ను రేపు సాయంత్రంలోగా పూర్తి చేయాలన్నారు.రుణ అర్హత కార్డులకు సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను అందించడానికి అర్హులైన వారికి కార్డులు జారీ చేసేందుకు గాను తహసీల్దార్లకు ఇప్పటికే సాంకేతిక డేటాను పంపడం జరిగిందని, అందుకు అనుగుణంగా విచారణ చేసి మీసేవ ద్వారా అందిన దరఖాస్తులకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా పంపిణి చేస్తున్న రేషన్ అక్రమ రవాణా జరగకుండా ప్రతి రూట్‌కి ఒక రూట్ ఆఫీసర్ తప్పక ఉండాలని, రేషన్ దుకాణదారులతో సమావేశం నిర్వహించి అక్రమర వాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో ఏజేసీ శివశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటోరైటప్283:మాట్లాడుతున్న ఇంచార్జి కలెక్టర్ దివ్య