హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. అమలు మాత్రం జరగలేదని తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం తీవ్ర నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 6 నుంచి అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలను బాయ్‌కాట్ చేస్తున్నాన్నట్లు ప్రకటించింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఇప్పటివరకు బకాయిలు తమకు అందలేదని డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం వెల్లడించింది. సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని స్థితిలో ఉన్నామని వారు వాపోయారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
డిగ్రీ పరీక్షలు బాయ్‌కాట్..
Published Sat, Dec 3 2016 4:58 PM | Last Updated on Fri, May 25 2018 3:26 PM
Advertisement
Advertisement