డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు చేతిలో పట్టుకుని ఉద్యోగాల కోసం వెతికితే సరైన జాబ్ దొరకం కష్టం. అలాంటిది ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి ఉద్యోగాలు రావడం మాట అటుంచి అప్లై , ఇంటర్వ్యూలో సరైన రీతిలో కమ్యూనికేట్ చేయడం చాలా ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం. దివ్యాంగుల ఇబ్బందులు తీర్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని ఉపయోగించారు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు.
ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వరాజ్‌ఎబిలిటీ పేరుతో ప్రత్యేక యాప్, పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా చూపు, వినికిడి, కదలికలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారి కోసం ప్రత్యేకంగా స్వరాజ్‌ఎబిలిటీని రూపొందించారు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఉద్యోగాలకు అప్లై చేయడం, ఇంటర్వ్యూ ఇవ్వడం వంటి పనులు దివ్యాంగులకు తేలిక అవుతుంది. ఫిబ్రవరి 4న ఈ యాప్/వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. టెక్నాలజీని అవసరమైన వారికి చేరువ చేసేలా ప్రయత్నించిన ఐఐటీ హైదరాబాద్‌ని కేంద్రం ప్రశంసించింది.
Comments
Please login to add a commentAdd a comment