
న్యూఢిల్లీ: పిల్లల మానసిక ఆరోగ్యం కోసం పని చేసే మామ్స్‌బిలీఫ్ సంస్థ ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం (ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్, నేర్చుకోలేకపోవడం తదితర) బీమా ప్లాన్‌ను తీసుకొచి్చంది. ‘మామ్స్ బిలీఫ్ కేర్–ఆది్వక్ చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్’ను కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో గురువారం ఆవిష్కరించింది. ప్రత్యేక అవసరాలతోపాటు, శ్రద్ధ అవసరమైన చిన్నారుల చికిత్సా వ్యయాలకు రూ.1.5–4 లక్షల మధ్య కవరేజీనిస్తుంది.
ఈ ప్లాన్‌లో రూ.1.5 లక్షల కవరేజీకి ప్రీమియం సుమారు రూ.22,000గా ఉంది. ‘‘ఎదుగుదలకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల అభివృద్ధే మా డీఎన్‌ఏ. 0–15 ఏళ్ల మధ్యనున్న ఉన్నవారి కోసం ప్రతి నెలా 30,000 సెషన్లు నిర్వహిస్తున్నాం’’ అని మామ్స్ బిలీఫ్ సీఈవో నితిన్ బిండ్లిష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment