ఆసరా పింఛన్లు అందక జిల్లాలో లబ్ధిదారులు ఇంకా ఆందోళనలకు దిగుతూనే ఉన్నారు. ఇప్పటికే పింఛన్ల పంపిణీ ప్రారంభమైనా.. పలువురి పేర్లు జాబితాల్లో కనిపించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టాల్సి వస్తోంది. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నారు. గురువారం కాగజ్‌నగర్ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన వికలాంగ యువతి స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆసిఫాబాద్, కెరమెరిలో ఆందోళనలు చేపట్టారు.
ఆసిఫాబాద్ : ‘ఆసరా’ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఆందోళనలు కొనసాగుతున్నా యి. గురువారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట, బూర్గుడ, కొమ్ముగూడ, ఆసిఫాబాద్‌కు చెందిన వృద్ధులు స్థానిక ఎంపీడీవో కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. పింఛన్‌పై ఆధారపడి బతుకుతున్న తమ పేర్లు తొలగించ డం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. అదే స మయంలో అక్కడికి చేరుకున్న జెడ్పీటీసీ సభ్యు డు కొయ్యల హేమాజీ, ఎంపీడీవో శ్రీనివాస్ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని హా మీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో గుండక్క, పోశక్క, తార, సౌమ్యరాణి, రాజక్క, తిరుపతి, అలీమా, వృద్ధులు పాల్గొన్నారు.
కెరమెరిలో..కెరమెరి : ఆంధ్రా, మహారాష్ట్ర వివాదాస్పద గ్రా మాలైన పరందోళి, కోటా, ముకందంగూడ, మ హరాజ్‌గూడ, తాండ గ్రామాలకు చెందిన వృ ద్ధులు, వితంతువులు, వికలాంగులు గురువా రం కెరమెరి ఎంపీడీవో కార్యాలయంలో గంట న్నరపాటు ధర్నా నిర్వహించారు. పింఛన్లు నిలి పివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా పింఛన్ రావడం లే దని ఆవేదన చెందారు. అక్కడికి వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు అబ్దుల్‌కలాంకు తమ సమస్యను విన్నవించారు. అధికారులతో మాట్లాడి పింఛ న్లు ఇప్పిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యాక్రమంలో ఎ.కిషన్, బాపూరావు, దేవాజీ, వి.కిష న్, మిట్టు, చంద్రభాగా, గంగాబాయి, తుల్సాబాయి, శ్యామలాబాయి పాల్గొన్నారు.
ఆసరా లేక ఆందోళన..
Published Fri, Dec 12 2014 2:54 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement
Advertisement