నేడు బీడీ కార్మికుల సమ్మె | Beedi workers' strike today | Sakshi
Sakshi News home page

నేడు బీడీ కార్మికుల సమ్మె

Published Tue, Nov 19 2013 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM

Beedi workers' strike today

ఖలీల్‌వాడీ, న్యూస్‌లైన్ :
 తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీ డీ కార్మికులు మంగళవారం సమ్మె చే యనున్నారు. ఏపీ బీడీ, సిగార్ వర్క ర్స్ యూనియన్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన మేరకు జిల్లాలోని రెం డున్నర లక్షల మంది కార్మికులు ఆం దోళనలో పాల్గొననున్నారు. కార్మికులు సంవత్సరాల తరబడి చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం కనీస వేతనాలను పెంచుతూ 2011లో జీ ఓ నం. 41 విడుదల చేసింది. ఈ జీ ఓ ప్రకారం కార్మికులకు వెయి బీడీలకు రూ.200లు చెల్లించాలి. అయితే, ఈ జీఓను అమలు చేయడంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ హించాయి. కార్మికుల సమస్యలను తీర్చడంలో శీత కన్ను వేశాయి.
 
  బీడీ కంపెనీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర సర్కారు జీఓ నం.41 నిలుపుదల చేస్తూ మరో జీఓ నం. 81 తీసుకు వచ్చింది. దీంతో తమ కడుపు కొట్టినట్లయ్యిందని బీడీ కార్మికులు ఆవేదన  చెందుతున్నారు. ఇదే అదునుగా జిల్లాలో గుర్తింపు పొందిన బీడీ కంపెనీలు వర్దీ (అనుమతి లేని) బీడీలను తయారు చేయించడం మొదలు పెట్టాయి. దీని ద్వారా ప్రతి వెయ్యి బీడీలకు కార్మికులు రూ. 30 నుంచి రూ. 40 నష్టపోతున్నారు. కంపెనీలు ప్రభుత్వానికి పన్ను కూడా ఎగ్గొడుతున్నాయి. వేతనాలు తక్కువైనప్పటికీ బీడీలు చేసిన కార్మికులకు హీరాలాల్ (హెచ్‌పీ) కంపెనీ నాలుగు నెలలుగా బట్వాడాలు ఇవ్వడం లేదు. దీంతో కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. బీడీ కార్మికులపై యా జమాన్యల శ్రమ దోపిడీ రోజురోజుకు ఎక్కువ అవుతూనే ఉంది. కార్మికులకు చేతినిండా పని కల్పించటంలో, గుర్తింపు కార్డులను, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయటంలో యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కాగా సమ్మెను విజయవంతం చేయాలని విలేకరుల సమావేశంలో ఏపీ బీడీ, సిగార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు రాములు కోరారు.
 
 ఉద్యమాలు చేసినా ఫలితం లేదు
 బీడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో సమ్మెకు దిగుతున్నాం.
 - నూర్జహాన్, ఏపీ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు
 
 వెయ్యి బీడీలకు రూ.200 ఇవ్వాలి
 వెయ్యి బీడీలకు రూ.200 ఇవ్వాలి. మాకు కనీసం పీఎఫ్, ఈఎస్‌ఐ కుడా లేదు. బీడీ కంపెనీలు కనీసం గుర్తింపు కార్డులను ఇవ్వడం లేదు. కంపెనీలో సమస్యలు పరిష్కరించాలి.
 - జయమ్మ, బీడీ కార్మికురాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement