బీడీ కార్మికుల గోడు వినేదెవరు?
Published Thu, Oct 6 2016 11:40 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
చేతినిండా పనిలేక తిప్పలు
అందని ఆసరా పథకం
ఆస్పత్రి లేక ఇబ్బందులు
భైంసా : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది బీడీకార్మికులు పనిచేస్తున్నారు. అందులో నిర్మల్ జిల్లాలోనే లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా చేతినిండా పనిలేక బీడీ కార్మికులు అలమటిస్తున్నారు. పెద్ద సంఖ్యలోనే ఉన్న కార్మికులకు స్థానికంగా ఆసుపత్రి కూడా లేదు. కార్మిక ఆసుపత్రి లేక రోగాలభారినపడుతున్న వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సివస్తుంది. తెలంగాణ ఏర్పడకముందే బీడీ కార్మికుల ఇబ్బందులు తెలిసిన ఈ ప్రభుత్వం కార్మికులందరికి జీవనభృతి చెల్లిస్తుంది. ప్రతినెల రూ. 1000 జీవనభృతిని ఆసర పథకం కింద అందిస్తున్నా కొంత మంది కార్మికులకే ఇది వర్తిస్తుంది. పూర్తిస్థాయిలో ఉన్న బీడీకార్మికులకు ఆసర పథకం కింద ప్రతినెల రూ. 1000 జీవనభృతి అందిస్తే వీరి కుటుంబాలు గడుస్తాయి.
ప్రధాన ఉపాధి
జిల్లాలో వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమయే ప్రధాన ఆధారం. ఈ పరిశ్రమపై జిల్లాలో లక్ష మందికిపైగా కార్మికులు ఉపాది పొందుతున్నారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా బీడీకార్మికులు ఉన్నారు. శివాజీ, షేర్‌షాప్, దేశాయి, రాజ్‌కమల్, చార్‌బాయ్, మారుతి ఇలా చెబుతుపోతే అన్ని బీడీ కంపెనీలు సగం రోజులే పని ఇస్తున్నాయి.
నెరవేరని డిమాండ్లు
బీడీ కార్మికుల కోసం ప్రభుత్వం జీఓ నం. 41 విడుదలచేసిన ఇప్పటికీ డిమాండ్లు నెరవేరలేదు. యాజమాన్యం ఒత్తిడితో ప్రభుత్వం మరో జీఓను విడుదలచేసింది. దీంతో కార్మికులు తరచు పోరాటాలుచేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బీడీ అమ్మకాలపై నిషేదాలు విదిస్తుంది. పుర్రెగుర్తు సైజును ప్రతియేటా పెంచుతూ వస్తుంది. ఈ గుర్తును తగ్గించాలని యాజమాన్యం సమ్మెకు దిగిన కార్మికులే నష్టపోతున్నారు. ఇటు ప్రభుత్వానికి అటు యాజమన్యానికి కార్మికుల ఇబ్బందులు పట్టడంలేదు. దీంతో చేసేదేమిలేక ఎవరికి చెప్పుకోలేక సగంరోజులే పనిచేసి కార్మికులంతాపస్తులుంటున్నారు.
Advertisement
Advertisement