- మార్చి నుంచి బీడీ కార్మికులకు పింఛన్: కేటీఆర్
సూర్యాపేట: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ వద్ద వాటర్‌గ్రిడ్ పనులకు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ చౌటుప్పల్ వద్ద జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనులు వారం రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు.
గత పాలకులు వదిలేసిన పాపాలను ఒక్కొక్కటిగా కడుగుతున్నామని చెప్పారు. బీడీ కార్మికులతోపాటు ఒంటరి స్త్రీలకు కూడా పింఛన్ పథకాన్ని అమలుచేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఖమ్మం, వైరాలో విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాకోర్టులో ఓడినవారు హైకోర్టుకు వెళ్లి కేసీఆర్ పాలన సక్రమంగా లేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పింఛన్ల కోసం కొండరెడ్ల కనిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు.