కేసీఆర్ బోళాశంకరుడు
మీ తప్పు వల్లే పింఛన్లు రాలేదు.. బీడీ కార్మికులతో ఎంపీ కవిత
కరీంనగర్: సీఎం కేసీఆర్ బోళాశంకరుడిలా అడిగిన వారికల్లా వరాలు ఇస్తాడని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని చల్‌గల్‌లో సోమవారం ‘మన ఊరు-మన ఎంపీ’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు బీడీ కార్మికులు తమకు పింఛన్ రావడం లేదని ఎంపీకి విన్నవించగా ‘సమగ్ర సర్వే చేసినప్పుడు బీడీల చాటను దాచిపెట్టి ‘మేం బీడీలు చుట్టడం లేదు’ అని చెప్పుకున్నారు. కొందరేమో తెలివిగా బీడీ కార్మికులు కాకపోయినా ‘మేం బీడీలు చుడుతున్నాం’ అని రాయించుకున్నరు.
దీంతో సర్వేలో ఉన్న వాళ్లకే పింఛన్లు వస్తున్నాయి.’ అని స్పష్టం చేశారు. సౌదీలో తన కుమారుడు చనిపోతే ఇప్పటి వరకు శవాన్ని కూడా తీసుకురాలేదని ఓ మహిళ విలపిస్తుండగా ‘సౌదీలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు శవాన్ని పంపించడం లేదు. ఆ దేశంతో భారత్‌కు ఎలాంటి ఒప్పందాలూ లేవు. ఈ విషయంపై పలుమార్లు విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడుతూనే ఉన్నాం.’ అని చెప్పారు.