ఎన్‌ఆర్‌ఐలకు తెలంగాణలో ప్రత్యేక రాయితీలు: కవిత | NRI's will invest to develop telangana, says mp kavitha | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐలకు తెలంగాణలో ప్రత్యేక రాయితీలు: కవిత

Published Tue, Feb 28 2017 8:57 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

NRI's will invest to develop telangana, says mp kavitha

రాయికల్‌ : తెలంగాణ అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌యూకే కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌సెల్‌ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేశారని గుర్తుచేశారు.

ప్రస్తుతం బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎన్‌ఆర్‌ఐలకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌సెల్‌ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, ఉపాధ్యక్షుడు దూసరి అశోక్, నవీన్‌రెడ్డి, శ్రీకాంత్, రత్నాకర్, సత్యం రెడ్డి, ప్రవీణ్‌కుమార్, కిరణ్‌రెడ్డి, శ్రీధర్‌రావు, మీడియా ఇన్‌చార్జి శ్రీకాంత్, యూకే ఇన్‌చార్జి విక్రమ్‌రెడ్డి, ఐటీ సెక్రటరి వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement