బీడీ కార్మికుల ఎంపికలో అయోమయం | Be confused with the selection of Beedi Workers | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికుల ఎంపికలో అయోమయం

Published Tue, Feb 24 2015 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

Be confused with the selection of Beedi Workers

తాజా మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
మోర్తాడ్/నిజామాబాద్: బీడీ కార్మికులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల భృతిని చెల్లించేందుకు ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం రెవెన్యూ అధికారులు సోమవారం నుంచి గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నారు. మొదట్లో జారీ చేసిన మార్గదర్శకాలకు, తాజా ఉత్తర్వులకు తేడా చాలా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక వారికి తలకు మించిన భారంగా మారింది.  

అయితే, తాజా మార్గదర్శకాల బీడీ కార్మికుల ప్రభుత్వం ఇవ్వదల్చుకున్న జీవన భృతి పథకాన్ని ఆసరా పథకం కిందనే అమలు చేయాలని భావిస్తోంది. బీడీ కార్మిక కుటుం బాల్లో ఇప్పటికే కొందరికి వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం ‘ఆసరా’ కింద ఇప్పటికే పింఛన్ పొందుతున్నందున వీరికి ‘భృతి’ లభించదు. ప్రభుత్వ ఆంక్షల కారణంగా అర్హత ఉన్న కార్మికులకు సైతం భృతి లభించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 
ఇవీ నిబంధనలు..
గతంలో బీడీలు చుట్టి మానివేసినవారు కేంద్రం అందిస్తున్న పీఎఫ్‌ను పొందుతూ ఉంటే, వారి కుటుం బంలోని ఇతర బీడీ కార్మికులకు జీవనభృతి వర్తిం చదు. ‘ఆసరా’ కింద లబ్ధి పొందుతున్నవారు ఉన్న కుటుంబంలోని కార్మికులకు వర్తించదు. ‘ఆసరా’ కింద ఫించన్ పొందేవారి కుటుంబంలో ఒకరికి మాత్రమే బీడీ భృతిని అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఎవరికీ బీడీ భృతిని వర్తింప చేయమని తాజా మార్గదర్శకాలలో ఉంది. అంతేకాక బీడీలు చుట్టి మానివేసి బీడీ పింఛన్‌ను పొందుతున్నవారు ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలోని ఇతర సభ్యులకు బీడీ భృతి వర్తించదు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయాలి. వచ్చే నెల ఒకటి నుంచి బీడీ కార్మికులకు భృతిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు గ్రామాలలో సర్వే చేస్తున్నారు.
 
ఇదీ పరిస్థితి...
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రిజిస్టర్డ్ బీడీ కార్మికులు దాదాపు 6.50 లక్షల మంది ఉన్నారు. పేరున్న బీడీ కంపెనీలే తమ కార్మికులను పీఎఫ్‌లో చేర్చు తున్నారుు. మిగతావారికి భృతి అందుతుందా లేదా అనేది తెలియడం లేదు. భృతి పొందాలంటే సమగ్ర కుటుంబ సర్వేలో కచ్చితంగా బీడీ కార్మికురాలుగా నమోదై ఉండాలి.వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలనే నిబంధనలు చేర్చారు. ఈ లెక్కన చూస్తే వేలాది మంది అనర్హులుగా మారే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement