- మెదక్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రోనాల్డ్‌రోస్, రఘునందనందన్‌రావు
చేగుంట: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారి భవిష్యత్తుకు కృషి చేస్తున్న బ్రైట్‌మైండ్స్ అకాడమీ కృషి అభినందనీయమని మెదక్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రోనాల్డ్‌రోస్, రఘునందనందన్‌రావు పేర్కొన్నారు. బెల్ టౌన్‌షిప్‌లోని శ్రీరామచంద్ర మిషన్ భవనంలో ఆదివారం రాత్రి బ్రైట్‌మైండ్స్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ సెర్మనీ నిర్వహించారు.
కార్యక్రమంలో మెదక్ రంగారెడ్డి, మహబూబ్‌నగర్ కలెక్టర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని విద్యావిధానంలో వస్తున్న అనేక మార్పులు పోటీ తత్వంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఉంటోందన్నారు. అదే తరుణంలో విద్యార్థుల మేధస్సుకు మరింత పదును పెట్టి బంగారు భవిషత్తుకు బాటలు వేసేందుకు శిక్షణ కార్యక్రమాలు అవసరమన్నారు.
అనంతరం కలెక్టర్లు రోనాల్డ్ రోస్, రఘునందన్‌రావు చేతుల మీదుగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు రామకృష్ణ, బిందు, స్వప్న, బెల్ అధికారులు ధనుంజయ్‌రావు ఉమామహేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.