పది మంది స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం
Published Sat, Aug 13 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
మహబూబాబాద్ : క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈనెల 9న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ‘రాష్ట్రపతి ఎట్ హోం’ కార్యక్రమా న్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వా తంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలంగాణ రా ష్ట్రానికి చెందిన పది మంది స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం లభించిందని అఖిల భారత స్వాతంత్య్ర సమర యోధుల వారసుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సింగు రమేష్ శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి అమిద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమో దీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారన్నా రు. జిల్లా నుంచి రాయపర్తి యాదగిరి, మ హంకాళ బాల పాపిరెడ్డి, బీరి అడవ య్య, జక్కని వెంకటయ్య, ఖమ్మం జిల్లా నుం చి కొమ్మినేని రంగారావు, అయితం వెంకటేశ్వ ర్లు, కరీంనగర్ జిల్లా నుంచి కళ్లెం నారాయణ, పోతు ఆదిరెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి బాచి పల్లి రామకృష్ణారావు, బండ పుల్లారెడ్డిలు స న్మానం పొందినట్లు పేర్కొన్నారు.
Advertisement