Honored
-
జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం
సాక్షి, విజయవాడ: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాను ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆయన గౌరవార్థం ప్రభుత్వం ఆత్మీయ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి హాజరయ్యారు. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను సత్కరించిన సీఎం వైఎస్ జగన్.. మెమెంటో అందజేశారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఇటీవలే సుప్రీం జడ్జిగా పదోన్నతి పొందారు. ఆయన ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెప్టెంబర్ 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా, 2021, జూన్ 1 వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. తర్వాత ఏపీ హైకోర్టు సీజేగా పని చేసి ఇటీవలే సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. చదవండి: ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం: సీఎం జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చీఫ్ విప్ ప్రసాదరాజుకు ఎమ్మెల్యే కొఠారి సత్కారం
దెందులూరు(పశ్చిమగోదావరి): ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్‌విప్‌గా ముదునూరి ప్రసాదరాజును ఎంపిక చేయడం వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఎంతో సంతోషాన్నిచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి అన్నారు. సోమవారం తాడేపల్లిలో ఏపీ చీఫ్‌విప్ చాంబర్లో ప్రసాదరాజును కలిశారు. శాలువా, బొకేతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి జానంపేట బాబు, దెందులూరు మండల పార్టీ కన్వీనర్ కామిరెడ్డి నాని, పోతునూరు మాజీ సొసైటీ చైర్మన్ గూడపాటి పవన్‌కుమార్ ఉన్నారు. చదవండి: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం -
సీఎం జగన్‌కు యడవల్లి దళిత రైతులు సత్కారం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఎడతెగని పోరాటం చేసిన తమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయం చేశారని గుంటూరు జిల్లా యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు పేర్కొన్నారు. తమ భూములకు ప్రభుత్వం తరపున రూ.30 కోట్ల పరిహారం చెల్లించడం ద్వారా.. ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని తెలిపారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో యడవల్లి దళిత రైతులు సోమవారం శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారంగా ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌ను సత్కరించారు. -
ఎస్ఈసీ నిమ్మగడ్డకు టీడీపీ నేతల సన్మానాలు
సాక్షి, విజయవాడ: రాజ్యాంగ పదవిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ నేతలా మారిపోయారు. ఆదివారం పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు టీడీపీ నేతలు సాదర స్వాగతం పలకడమే కాకుండా, స్వయంగా సన్మానాలు కూడా చేశారు. నిమ్మగడ్డను టీడీపీ నేతలు తాతినేని పూర్ణచంద్రరావు, బుజ్జి కోటేశ్వరరావు, శీలం బాబురావు, సుబ్రహ్మణ్యం, మండవ వీరభద్రరావు, మండవ రవికిరణ్, మండవ రాజ్యలక్ష్మి సన్మానించారు. రాజకీయనేతలా ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. (చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చంద్రబాబు తొత్తు) ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తప్పుపట్టారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి టీడీపీ నేతలతో సన్మాలానా? అంటూ మండిపడ్డారు. నిమ్మగడ్డ.. టీడీపీ నేతలా మారిపోయారని.. అందుకు టీడీపీ నేతల సన్మానాలే నిదర్శనమని ఎమ్మెల్యే అనిల్ కుమార్ దుయ్యబట్టారు.(చదవండి: నిమ్మగడ్డ ‘కోడ్’ ముందే కూత) -
గజల్ శ్రీనివాస్‌కు సత్కారం
చెన్నై,కొరుక్కుపేట: చెన్నై టి.నగర్‌లోని ప్రముఖ సేవా సంస్థ ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి మార్యాద పూర్వకంగా విచ్చేసిన గజల్ శ్రీనివాస్‌కు ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ సునీల్, ఆస్కా సంయుక్త కార్యదర్శి జేకే రెడ్డిలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్‌ను దుశ్శాలువాలతో సత్కరించారు. అనంతరం గజల్ శ్రీనివాస్ ట్రస్ట్ కార్యాలయంలోని గ్యాలరీలను సందర్శించి ట్రస్ట్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మన తెలుగు వాడైన డాక్టర్ సునిల్ చెన్నై మహానగరంలో చేస్తున్న సేవలు హర్షణీయమన్నారు. దేవుని దయతో దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. -
సింధును సత్కరించిన ఏపీ గవర్నర్
-
గాంధీ భవన్లో తెలంగాణ ఎంపీలకు సన్మానం
-
పద్మశ్రీ’ నాది కాదు.. వారందరిదీ!
‘‘చెంబోలు సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల’ చిత్రంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిని చేసి, సినీ రంగంలో జన్మనిచ్చి ప్రోత్సహించిన దర్శకులు కె. విశ్వనాథ్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను. నా ఈ అభ్యున్నతికి కారణం నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులు, సినీ జన్మనిచ్చిన విశ్వనాథ్‌గారు, పెంచిపోషించిన సినిమా తల్లి, ఇన్నేళ్లు నా వెన్నంటి ఉండి కలసి ప్రయాణించిన నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, నా కుటుంబ సభ్యులు. అందుకే తెలుగులో సినీ గేయకవితా రచన విభాగానికి తొలిసారి వచ్చిన ఈ ‘పద్మశ్రీ’ అవార్డు నాది కాదు.. వారందరిదీ! అందుకే, ఇది నాకు అభినందన కాదు ఆశీర్వాద సభగా భావిస్తున్నా’’ అని సినీ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. భారత ప్రభుత్వం సిరివెన్నెలకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా కళాత్మక చిత్రాల దర్శకుడు కె. విశ్వనాథ్ స్వగృహంలో ‘చిరువెన్నెలలో సిరిమల్లెలు’ పేరిట ఆత్మీయ అభినందన సభ జరిగింది. సీతారామశాస్త్రి దంపతులను, ఆయన మాతృమూర్తిని విశ్వనాథ్ కుటుంబం సాదరంగా సత్కరించింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘పద్మశ్రీ’ పురస్కారం రావడం ఆలస్యమైందా, ముందుగా వచ్చిందా లాంటి మాటలను అటుంచితే రావాల్సిన వ్యక్తికి రావడం ఆనందంగా ఉంది. స్వయంకృషి, సాధనతో ఈ స్థాయికి ఎదిగిన సీతారామశాస్త్రి తన మొదటి చిత్రం ‘సిరివెన్నెల’ రోజులలానే ఇప్పటికీ నిగర్వంగా ఉండటం విశేషం. సాహితీ మానస పుత్రుడైన శాస్త్రి మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నా’’ అన్నారు. విశ్వనాథ్, సీతారామశాస్త్రి కలయికలోని వివిధ చిత్రాల్లోని పాటలను గాయనీ గాయకులు ఉష, శశికళ, హరిణి, సాయిచరణ్ గానం చేశారు. వేణుగాన విద్వాంసుడు నాగరాజు, నటి, నాట్యకళాకారిణి ఆశ్రిత వేముగంటి, ‘సప్తపది’ ఫేమ్ సబిత కొన్ని పాటలకు తమ కళా ప్రదర్శనతో మరింత రక్తి కట్టించారు. సంగీత దర్శకుడు మణిశర్మ, నటుడు గుండు సుదర్శన్ పాల్గొన్నారు. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, దశరథ్, వీఎన్ ఆదిత్య, ఇంద్రగంటి, కాశీ విశ్వనాథ్, బీవీఎస్ రవి, రచయితలు జనార్దన మహర్షి, రామజోగయ్య శాస్త్రి, బుర్రా సాయిమాధవ్, అబ్బూరి రవి, నిర్మాతలు రాజ్ కందుకూరి, ఏడిద శ్రీరామ్, నటుడు జిత్‌మోహన్ మిత్రా, ‘మా’ శర్మ, యాంకర్ ఝాన్సీ తదితరులు ‘సిరివెన్నెల’తో తమ అనుభవాలను పంచుకున్నారు. ∙సిరివెన్నెల, పద్మ, విశ్వనాథ్ -
కౌశల్ ఆర్మీని విస్తరిస్తా..
సాక్షి బెంగళూరు: భవిష్యత్తులో కౌశల్ ఆర్మీని మరింతగా విస్తరిస్తానని బిగ్‌బాస్ తెలుగు సీజన్–2 విజేత కౌశల్ మండ స్పష్టం చేశారు. కౌశల్ ఆర్మీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు శనివారం కౌశల్ బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరు మారతహళ్లిలోని తులసి థియేటర్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్–2 విజేత అయ్యేందుకు సహకరించిన ప్రతిఒక్క ఆర్మీ సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. తన అభిమానులంతా కౌశల్ ఆర్మీ పేరిట సమాజ సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలా సేవా కార్యక్రమాలను కొనసాగించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అనంతరం ఐటీపీఎల్‌లో ఉన్న బిర్యానీ జోన్‌కు వెళ్లి అభిమానులతో కలసి భోజనం చేశారు. బిర్యానీజోన్ యజమానులు విజయభాస్కర్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డిలు కౌశల్‌కు సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఇక్కడి బిర్యానీ రుచికి ఫిదా అయిన కౌశల్, తెలుగువారి ప్రత్యేక డిష్ అయిన బిరియానిని బెంగళూరు వాసులకు అందజేస్తున్న విజయభాస్కర్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డిలను అభినందించారు. -
మాతో సమానమా?!
చివరగా ఆ విద్యాలయంలోనే ఉంటూ ఉన్న వంట సిబ్బందిని, నౌకర్లను కూడా వేదికపైకి ఆహ్వానించి వారినీ సత్కరించారు. ఇది కొందరు గురువులకు నచ్చలేదు.అదొక పెద్ద జెన్ విద్యాలయం. అక్కడ రెండు తరాలుగా ఎందరో సాధువులు క్రమపద్ధతిలో తర్ఫీదు పొందారు. ఆ విద్యాలయం ఆరంభించి ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారీ స్థాయిలో వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన గురువుతోపాటు ఎందరో తరలివచ్చారు. ఈ సంస్థ పురోగాభివృద్ధికి కృషి చేసిన వారినీ, గురువులను, ప్రముఖులను, దాతలను పేరుపేరునా కొనియాడారు. అంతేకాదు, ఈ గుర్తుగా వారందరికీ జ్ఞాపికలు కూడా అందజేశారు. చివరగా ఆ విద్యాలయంలోనే ఉంటూ ఉన్న వంట సిబ్బందిని, నౌకర్లను కూడా వేదికపైకి ఆహ్వానించి వారినీ సత్కరించారు. ఇది కొందరు గురువులకు నచ్చలేదు. ఆగ్రహం తెప్పించింది. వంట సిబ్బందినీ, నౌకర్లనూ వేదిక మీదకు పిలిచి మాతోపాటు సత్కరించడం బాగులేదని కొందరు బహిరంగంగానే విమర్శించారు. నానా మాటలన్నారు. ఉపదేశ పాఠాలు చెప్పిన తాము, ఈ వంటవాళ్లూ నౌకర్లూ సమానమా అని దుయ్యబట్టారు. అప్పుడు ప్రధాన గురువు వారి మాటలకు ఏ మాత్రం కోప్పడకుండా నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘‘వంట సిబ్బంది, ఇతర నౌకర్లూ మీతో సమానులే అందులో అనుమానమేమీ అక్కర్లేదు. ధమ్మపథంలో బుద్ధుడు ఏం చెప్పాడో గుర్తు చేసుకుంటే మీకీ ఆగ్రహం రానే రాదు. ఈ ఆశ్రమంలో, ఈ ఊళ్లో, ఈ దేశంలో, ఈ సమాజంలో ఎటు చూసినా రెండే వర్గాలున్నాయి. వాటిలో మొదటి వర్గం వారు పాఠాలు చెప్తారు. రెండో వర్గంవారు చదువుకుంటున్న వారికీ, పాఠాలు బోధించేవారికీ సాయపడతారు. ఈ రెండు వర్గాల సభ్యులు సరి సమానమే. వీరిద్దరూ ఒకరి అవసరాలను మరొకరు తెలుసుకుని కలసిమెలసి పని చేస్తేనే ఈ సమాజం మెరుగుపడుతుంది. వికసిస్తుంది’’ అని చెప్పారు. – యామిజాల జగదీశ్ -
‘మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్’కు సత్కారం
హైదరాబాద్: ‘క్లాసిక్ మిసెస్ ఇంటర్నేషనల్ వరల్డ్–2017’ పోటీల్లో విజేతగా నిలిచిన మమతా త్రివేదిని హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. లాలా దవాసాజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మిసెస్ ఇండియా పేజెంట్స్, ప్రొడక్షన్స్ జాతీయ డైరెక్టర్ దీపాలీ ఫడ్నిస్ హాజరయ్యారు. మోడల్స్ కాకుండా రోల్‌మోడల్స్ అన్వేషణే మిసెస్ ఇండియా లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించారు. లాలా దవాసాజ్ సంస్థ ఉత్పత్తులకు మమతా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల చైనాలోని డాంగ్యాంగ్ సిటీలో మిసెస్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఫైనల్స్ నిర్వహించారు. గత జూలైలో క్లాసిక్ మిసెస్ ఇండియాగా గెలిచిన మమతా హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. -
అపూర్వకు ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: క్యారమ్ ప్రపంచ చాంపియన్ అపూర్వకు బుధవారం ఘనసన్మానం జరిగింది. బర్మింగ్హమ్లో జరిగిన వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించిన తమ ఉద్యోగి అపూర్వను ఎల్ఐసీ ఘనంగా సన్మానించింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఎల్ఐసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్, రీజనల్ మేనేజర్ మజర్ హుస్సేన్, హైదరాబాద్ క్యారమ్ సంఘం అధ్యక్షుడు హరనాథ్‌తో పాటు పలువురు ఎల్ఐసీ సీనియర్ ఉద్యోగులు పాల్గొన్ని ఆపూర్వను అభినందించారు. ఎల్ఐసీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా ఎదిగానని ఈ సందర్భంగా అపూర్వ పేర్కొంది. వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో ఆమె మూడు స్వర్ణాలను సాధించింది. -
ఆ పోలీసు ప్రయత్నం ఫలించింది
-
సాయుధ పోరాట యోధుడికి సన్మానం
కోదాడ: తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంకు, నడిగూడెం దొరకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన నడిగూడెం మండలం వాయిల సింగారానికి చెందిన చండూరు రామారావును ఆదివారం సీపీఎం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక సుందరయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కుక్కడపు ప్రసాద్ మాట్లాడుతూ మునగాల పరగణాకు చెందిన నడిగూడెం జమిందార్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. సర్పంచ్‌గా పనిచేసిన 15 సంవత్సరాల కాలంలో 100 ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత రామారావుదన్నారు. పేదల కోసం నిరంతర ఉద్యమాలు నిర్వహించిన రామారావును స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమపంగు రాధాకృష్ణ, సూర్యనారాయణ, స్వరాజ్యం, కృష్ణ, లక్ష్మయ్య, శ్రీనివాస్, సతీశ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
సక్రమంగా పన్ను చెల్లిస్తే సత్కారం!
దశాబ్దాల తర్వాత మళ్లీ సీబీడీటీ శ్రీకారం న్యూఢిల్లీ: నిజాయితీగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారిని సత్కరించే కార్యక్రమానికి ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ మళ్లీ శ్రీకారంచుడుతోంది. గడిచిన కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్న దేశంలోని లక్షలాది మంది ట్యాక్స్‌పేయర్లను కేంద్రీయ ప్రత్యక్షపన్నుల విభాగం(సీబీడీటీ) త్వరలోనే సన్మానించనుంది. దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ విధమైన చర్యలను అమలు చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవలే ఆమోదించిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనిప్రకారం సీబీడీటీ పన్నుచెల్లింపుదారులను అధిక మొత్తంలో, క్రమం తప్పకుండా, నిబంధనలకు అనుగుణంగా, నిబద్ధతతో వ్యవహరించడం... ఇలా నాలుగు విభాగాలుగా విభజించింది. వీరికి సీబీడీటీ చైర్పర్సన్ సంతకంతో సన్మాన పత్రాలను ఈ-మెయిల్ ద్వారా పంపనున్నారు. అయితే, కొంతమందిని ప్రత్యక్షంగా కూడా సత్కరించి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేతులమీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేయనుండటం విశేషం. నిజాయితీగా, క్రమం తప్పకుం డా పన్నులు చెల్లించడం ద్వారా దేశ పురోభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నవారికి ధన్యవాదాలు తెలియజేయడంతోపాటు తగినవిధంగా గౌరవించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మళ్లీ మొదలుపెడుతున్నట్లు సీబీడీటీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో సీబీడీటీ తమ అధికారుల కోసం నిర్వహించిన ఒక సదస్సులో ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించే అంశాన్ని చర్చించి.. ప్రతిపాదనలను రూపొందించింది. తమ కార్యాలయ పరిధిలో ఇటువంటి నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను గుర్తించి, వారి పేర్లను పంపాల్సిందిగా ప్రాంతీయ ఐటీ కమీషనర్లకు సీబీడీటీ సూచించినట్లు సమాచారం. కాగా, ఈ సత్కారాలకోసం సిఫార్సుచేసే ట్యాక్స్‌పేయర్ల సంఖ్య లక్షల్లోనే ఉండొచ్చని ఐటీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఐటీ శాఖ ఈ స్కీమ్‌ను అమలు చేసింది. అయితే, తమకు నేరగాళ్లనుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ కొంతమంది బడా పన్నుచెల్లింపుదారులు ఫిర్యాదులు చేయడంతో ఆతర్వాత దీన్ని నిలిపివేసింది. -
పది మంది స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం
మహబూబాబాద్ : క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈనెల 9న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ‘రాష్ట్రపతి ఎట్ హోం’ కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వా తంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలంగాణ రా ష్ట్రానికి చెందిన పది మంది స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం లభించిందని అఖిల భారత స్వాతంత్య్ర సమర యోధుల వారసుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సింగు రమేష్ శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి అమిద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమో దీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారన్నా రు. జిల్లా నుంచి రాయపర్తి యాదగిరి, మ హంకాళ బాల పాపిరెడ్డి, బీరి అడవ య్య, జక్కని వెంకటయ్య, ఖమ్మం జిల్లా నుం చి కొమ్మినేని రంగారావు, అయితం వెంకటేశ్వ ర్లు, కరీంనగర్ జిల్లా నుంచి కళ్లెం నారాయణ, పోతు ఆదిరెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి బాచి పల్లి రామకృష్ణారావు, బండ పుల్లారెడ్డిలు స న్మానం పొందినట్లు పేర్కొన్నారు. -
సుధకు సువర్ణ కంఠాభరణం
సినీ నటి సుధ భీమవరం ప్రజల ఆత్మీయ సత్కారం అందుకున్నారు. మావుళ్లమ్మ ఆలయ స్వర్ణోత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ, నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం ప్రతినిధులు గురువారం రాత్రి ఆమెను సువర్ణ కంఠాభరణంతో సత్కరించారు. ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ.. తల్లి పాత్రలు చేస్తున్నందుకు గర్వపడుతున్నా అన్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తల్లి పాత్రలు వస్తాయన్నారు. మావుళ్లమ్మ ఆలయ స్వర్ణోత్సవాల్లో తనను సత్కరించడం జీవితాంతం మర్చిపోలేనని అన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు అడ్డాల రంగారావు, అధ్యక్షుడు మానే పేరయ్య, నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు కాగిత వీరమహంకాళిరావు, అధ్యక్షుడు రామాయణం గోవిందరావు, గన్నాబత్తుల నాగేశ్వరరావు, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కంబాల రామారావు, నల్లం సూర్యచక్రధరరావు, దాయన సురేష్‌చంద్రజీ పాల్గొన్నారు. - న్యూస్‌లైన్/భీమవరం కల్చరల్ -
ప్రభుత్వ వాహన డ్రైవర్లకు సత్కారం
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రభుత్వ వాహనాల డ్రైవర్లకు సంఘం ఆధ్వర్యాన ఆర్థిక సహాయం అందజేసి, వారిని ఘనంగా సత్కరించారు. ఏలూరులోని ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి సంఘ అధ్యక్షుడు యండమూరి నాగరాజు అధ్యక్షత వహించారు. జిల్లాలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఎస్కే మహమూబ్ (జేసీ డ్రైవర్)కు రూ. 5,116 అందజేశారు. ఆ మొత్తాన్ని ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న మరో డ్రైవర్ యాకోబ్ కుటుంబానికి అందించారు. అనంతరం వివిధ డివిజన్లలో పదోన్నతులు పొందిన ప్రభుత్వ డ్రైవర్లను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి. గంగాజలం (డీపీఆర్వో కార్యాలయం), జి.నాగభూషణం (అట వీ శాఖ), సంఘ జిల్లా నాయకులు వి. రవికుమార్, డీసీహెచ్ వెంకటేశ్వరరావు, బీహెచ్ శ్రీనివాసరావు, జి. ఈశ్వరరావు, ఆర్.బాలకృష్ణ సింగ్, ఎంవీడీ ప్రసాద్, పి. వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.