
గజల్ శ్రీనివాస్‌ను సత్కరిస్తున్న డాక్టర్ సునీల్, జేకే రెడ్డి
చెన్నై,కొరుక్కుపేట: చెన్నై టి.నగర్‌లోని ప్రముఖ సేవా సంస్థ ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి మార్యాద పూర్వకంగా విచ్చేసిన గజల్ శ్రీనివాస్‌కు ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ సునీల్, ఆస్కా సంయుక్త కార్యదర్శి జేకే రెడ్డిలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్‌ను దుశ్శాలువాలతో సత్కరించారు. అనంతరం గజల్ శ్రీనివాస్ ట్రస్ట్ కార్యాలయంలోని గ్యాలరీలను సందర్శించి ట్రస్ట్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మన తెలుగు వాడైన డాక్టర్ సునిల్ చెన్నై మహానగరంలో చేస్తున్న సేవలు హర్షణీయమన్నారు. దేవుని దయతో దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు.