ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రభుత్వ వాహనాల డ్రైవర్లకు సంఘం ఆధ్వర్యాన ఆర్థిక సహాయం అందజేసి, వారిని ఘనంగా సత్కరించారు. ఏలూరులోని ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి సంఘ అధ్యక్షుడు యండమూరి నాగరాజు అధ్యక్షత వహించారు. జిల్లాలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఎస్‌కే మహమూబ్ (జేసీ డ్రైవర్)కు రూ. 5,116 అందజేశారు. ఆ మొత్తాన్ని ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న మరో డ్రైవర్ యాకోబ్ కుటుంబానికి అందించారు. అనంతరం వివిధ డివిజన్లలో పదోన్నతులు పొందిన ప్రభుత్వ డ్రైవర్లను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి. గంగాజలం (డీపీఆర్‌వో కార్యాలయం), జి.నాగభూషణం (అట వీ శాఖ), సంఘ జిల్లా నాయకులు వి. రవికుమార్, డీసీహెచ్ వెంకటేశ్వరరావు, బీహెచ్ శ్రీనివాసరావు, జి. ఈశ్వరరావు, ఆర్.బాలకృష్ణ సింగ్, ఎంవీడీ ప్రసాద్, పి. వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వాహన డ్రైవర్లకు సత్కారం
Published Mon, Dec 16 2013 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement