సుధకు సువర్ణ కంఠాభరణం | Film actress Sudha Bhimavaram People Honored | Sakshi

సుధకు సువర్ణ కంఠాభరణం

Published Fri, Jan 31 2014 2:05 AM | Last Updated on Tue, Oct 2 2018 2:48 PM

Film actress Sudha  Bhimavaram People Honored

సినీ నటి సుధ భీమవరం ప్రజల ఆత్మీయ సత్కారం అందుకున్నారు. మావుళ్లమ్మ ఆలయ స్వర్ణోత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ, నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం ప్రతినిధులు గురువారం రాత్రి ఆమెను సువర్ణ కంఠాభరణంతో సత్కరించారు. ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ.. తల్లి పాత్రలు చేస్తున్నందుకు గర్వపడుతున్నా అన్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తల్లి పాత్రలు వస్తాయన్నారు. మావుళ్లమ్మ ఆలయ స్వర్ణోత్సవాల్లో తనను సత్కరించడం జీవితాంతం మర్చిపోలేనని  అన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు అడ్డాల రంగారావు, అధ్యక్షుడు మానే పేరయ్య, నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు కాగిత వీరమహంకాళిరావు, అధ్యక్షుడు రామాయణం గోవిందరావు, గన్నాబత్తుల నాగేశ్వరరావు, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కంబాల రామారావు, నల్లం సూర్యచక్రధరరావు, దాయన సురేష్‌చంద్రజీ పాల్గొన్నారు.                                     
 - న్యూస్‌లైన్/భీమవరం కల్చరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement