ఏపీలో టీడీపీ పేకాట విధానం కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కైకలూరులోని ఎంపీ మాగంటి బాబు కార్యాలయం పేకాట డెన్‌గా మారిందని దుయ్యబట్టారు. ఇక్కడ రోజుకు రూ. 12 కోట్ల వ్యాపారం జరుగుతోందని, పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. తమకు ప్రత్యేక రాజ్యాంగం ఉందన్నట్టుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పిందే చట్టం అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వ వైఖరి ఉందన్నారు.