Battula Brahmananda Reddy
-
చంద్రబాబు నైజం బయట పడింది : బత్తుల
తుళ్లూరు: రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయకుండా నియంత్రించే జీవోను తీసుకురావటం ద్వారా చంద్రబాబు నైజం బయట పడిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. హత్యాయత్నం తర్వాత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంపూర్ణమైన ఆరోగ్యంతో కోలుకుని తిరిగి పాదయాత్ర ప్రారంభించాలని.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి కావాలంటూ పర్చూరు నియోజకవర్గ కార్యకర్తలు చేపట్టిన పాదయాత్ర శనివారం తుళ్లూరు మండల పరిధిలోని పెదపరిమి గ్రామం నుంచి మంగళగిరి మండలం కృష్ణాయపాలెం మీదుగా తాడేపల్లి మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లింగాయపాలెం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీబీఐ జోక్యం చేసుకుంటే చంద్రబాబు హత్యారాజకీయాలు, రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలు బయటపడతాయనే భయంతో చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఒక భాగమైన ఆంధ్ర రాష్ట్రానికి సీబీఐ రాకుండా చట్టం ఎలా చేస్తారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేస్తే వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిజాలు బయటపడతాయనేది స్పష్ట మవుతుండడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తు తున్నాయన్నారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి నందిగం సురేష్, తుళ్లూరు, ఇంకొళ్లు మండల అధ్యక్షులు బత్తుల కిషోర్, బండారు ప్రభాకర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కల లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చారు
సాక్షి, ప్రకాశం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వంద్వ విధానాలతో ప్రజలను మోసం చేస్తూ.. రాజకీయాలను వ్యాపార సంస్థలుగా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన టీడీపీ.. ఇంకా బీజేపీతో చాటుమాటుగా కాపురం చేస్తుందని.. అలాంటి చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని అన్నారు. నీతివంతమైన రాజకీయాలు చేయడం వైఎస్ జగన్‌కు అలవాటయితే.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ తన పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటని బత్తుల ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమిలేదని మండిపడ్డారు. రామాయపట్నం పోర్టు మొదలు వెలుగొండ ప్రాజెక్టు వరకు జిల్లాలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. -
దోచుకున్నది దాచుకోడానికే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దోచుకున్న అవినీతి సొమ్మును దాచుకోవటానికే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు గద్దె నెక్కినప్పటి నుంచీ ఏటా నాలుగుసార్లు విదేశీ పర్యటనలు చేస్తున్నారని, ఇప్పటికి 17సార్లకు పైగా ఇలాంటి పర్యటనలు చేశారని చెప్పారు. ఎన్ని పర్యటనలు చేసినా ఈ నాలుగేళ్లలో సీఎం సాధించింది ఏమీ లేదన్నారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. దావోస్‌కు చంద్రబాబుతో పాటు సీఎం రమేష్, లోకేష్ వెళ్లటంలో ఆంతర్యం ఏమి టని ప్రశ్నించారు. రమేష్ అనుభవం అంతా కాంట్రాక్టుల్లో సంపాదిం చటమేనని విమర్శించారు. ఇక లోకేశ్‌కు ఉన్న అనుభవం ఏమిటో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు విదేశీయాత్రల వివ రాలను పొందుపరుస్తూ శ్వేతపత్రం విడు దల చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. విదేశీ పర్యటనల్లో రూ.వేల కోట్లలో పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నట్లు ప్రచారం చేశారే తప్ప ఒక్క శాతం నిధులూ తేలేకపోయారన్నారు. -
ఆడిందే ఆట, చెప్పిందే చట్టం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో టీడీపీ పేకాట విధానం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కైకలూరులోని ఎంపీ మాగంటి బాబు కార్యాలయం పేకాట డెన్‌గా మారిందని దుయ్యబట్టారు. ఇక్కడ రోజుకు రూ. 12 కోట్ల వ్యాపారం జరుగుతోందని, పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. తమకు ప్రత్యేక రాజ్యాంగం ఉందన్నట్టుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పిందే చట్టం అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. చంద్రబాబు సర్కారు అక్రమార్కులకు అండగా నిలుస్తోందని ఆరోపించారు. విజయవాడ సెక్స్ రాకెట్, ఎంపీ ఇంట్లో పేకాట, దుర్గమ్మ ఆలయ భూముల కబ్జా, రోడ్ల వెడల్పు పేరుతో 40 దేవాలయాలను కూల్చివేయడం, సదావర్తి భూములను కాజేసేందుకు ప్రయత్నం.. వీటన్నింటికి చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలిచిందని ధ్వజమెత్తారు. దౌర్జన్యాలకు దిగిన టీడీపీ నాయకులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబుకు ఎటువంటి శిక్షలు లేవన్నారు. న్యాయం, ధర్మం తమకు వర్తించవన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, అతి దుర్మార్గం ప్రవర్తిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని వాపోయారు. దళితులపై దాడుల, రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్థిక నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసేవిధంగా ప్రతిపక్ష సభ్యులు కొందరిని టీడీపీలో చేర్చుకుని అధికార పదవుల్లో కూర్చోబెట్టారని విమర్శించారు. దేశ చరిత్రలో ఇంత అరాచక పాలన ఎప్పుడు చూడలేదన్నారు. ప్రజలు చైతన్యవంతులై వాస్తవ పరిస్థితులను గ్రహించి చంద్రబాబు సర్కారు సాగిస్తున్న దోపిడీ విధానాన్ని అరికట్టాలన్నారు. టీడీపీ దుర్మార్గ పాలనను అంతమొందించాలని బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. -
ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పిందే చట్టం
-
సమస్యలు గాలికొదిలేసి వ్యక్తిగత దాడులా?
ఒంగోలు: శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ తప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గుక్కెడు మంచినీళ్లు లేక ఓ వైపు జనం అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్షంపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. సభలో ప్రతిపక్షం ప్రజా సమస్యలపై నిలదీస్తే చంద్రబాబు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వితండవాదాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని బత్తుల పేర్కొన్నారు. -
ప్రతి జిల్లాలో 50వేల ఎకరాల భూసేకరణా?
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం మరో ఏడు లక్షల ఎకరాలు సేకరించటానికి ప్రభుత్వం సిద్ధం గా ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొనటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. రైతుల నుంచి లక్షల ఎకరాలు సేకరించి పరిశ్రమల పేరుతో ఎవరికి పడితే వారికి ఇస్తామని ప్రకటన చేయటం చంద్రబాబు ప్రభుత్వ భూదాహానికి నిదర్శమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బత్తుల మాట్లాడు తూ... చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలతో రైతుకు, భూమికి ఉండే బంధాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో మూడు లక్షల ఎకరాలను సేకరించామని జీవో జారీ చేసిన ప్రభుత్వం మరో ఏడు లక్షల ఎకరాలను సేకరించి 10 లక్షల ఎకరాల భూ బ్యాంకును ఏర్పాటు చేస్తామనడంపై మండిపడ్డారు. ఒక్కో జిల్లా నుంచి 50 వేల ఎకరాల చొప్పున 13 జిల్లాల నుంచి సేకరిస్తామని చెప్ప డం సరికాదన్నారు. శాశ్వ తంగా రైతుల్ని మోసం చేయటమే చంద్రబాబు విధానమా? అని ప్రశ్నిం చారు. రుణమాఫీ వల్ల రైతులు బయటపడకపోగా రుణఊబిలో కూరుకుపోయే పరిస్థితులు దాపురించాయ న్నారు. రూ.10వేల కోట్లు మాత్రమే చెల్లించి.. మూడోవంతు రుణాలు మాఫీ చేశామని ప్రకటనలు చేస్తూ ప్రజల్ని, రైతులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. -
ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?
-
బాబూ ప్రజల నుంచి ర్యాంకు తెచ్చుకో..!
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోనే మేటి రాజధాని నిర్మిస్తున్నానని, తన పాలన నంబర్ వన్‌గా ఉందని చంద్రబాబు ప్రచారం చేసుకోవటంపై బత్తుల మండిపడ్డారు. ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టినందుకు సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఏపీకి ఫస్ట్ ర్యాంకు వచ్చిందా అని ప్రశ్నించారు. దేశం మొత్తం మీద సర్వే చూస్తే 91.4 శాతంతో బాబు పాలనంతా అవినీతి, దోపిడీ జరుగుతోందని ఎన్‌సీఈఏఆర్ సర్వేలో తేలిందని, 74.3 శాతం పారిశ్రామికవేత్తలు ఇదే అంటున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, మేధావుల నుంచి చంద్రబాబు ర్యాంకు పొందాలని బత్తుల హితవు పలికారు. చంద్రబాబు చేపట్టిన నవ నిర్మాణ దీక్షలను నయవంచన దీక్షగా బత్తుల అభివర్ణించారు. ఆ అర్హత నీకెక్కడిది..? చంద్రబాబు తన చేతకానితనాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టేసే పరిస్థితికి వచ్చారని బత్తుల మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత బాబుకు లేదన్నారు. రైల్వే కాంట్రాక్టర్‌ను బెదిరించిన టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అవినీతిపై కేసు ఉండదనీ, ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకు తమ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధనరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలపై అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ నెల 6న విశాఖలో జరిగే ‘జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో తమ అధ్యక్షుడు వైఎస్ జగన్.. చంద్రబాబు చేతకానితనాన్ని, అసమర్థతను ఎండకడుతూ ప్రత్యేక హోదా పట్ల ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. -
'ఇంజినీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి'
హైదరాబాద్ : ఇంజినీర్లు అసమర్థులన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తెలుగువారిని కించపరచడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తులు బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 'దేశంలోనే గొప్ప ఇంజినీర్ల మన తెలుగు గడ్డపై పుట్టిన విషయం చంద్రబాబుకు తెలియదా?. నాసాలో కూడా 36శాతం ఇంజినీర్లు భారతీయులే. వెంటనే ఇంజినీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో టీడీపీ నేతలు ఎందుకు పెట్టుబడులు పెట్టారు?. హోదా అవసరం లేదంటున్న టీడీపీ నేతలు ఏపీలో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు?' అని ప్రశ్నించారు. ఇటీవల రాయలసీమ పర్యటనలో భాగంగా చంద్రబాబు... తన మొహమాటంతో ఇన్నాళ్లు మిమ్మల్ని శిక్షించకుండా క్షమించానని, నా వేగాన్ని అందుకోవాలి, లేదంటే వెళ్లిపోవాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
'ఇంజినీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి'
-
నీ చేతగానితనానికి జగన్‌పై నిందలా? : బత్తుల
చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల మండిపాటు సాక్షి, హైదరాబాద్: చేతగాని పరిపాలనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక ఆ ప్రజల దృష్టి మరల్చడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి జగన్ అడ్డుపడుతున్నారంటూ చంద్రబాబు చెబుతున్న మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరని చెప్పారు. పవిత్ర పుష్కరాలు జరుగుతున్న కృష్ణా నది ఒడ్డున కూర్చుని రాజకీయం చేస్తూ చంద్రబాబు ఇలా మాట్లాడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన భై ఏళ్ల వయసు, 60 ఏళ్ల పాత్రికేయ అనుభవం ఉన్న ఏబీకే ప్రసాద్ ప్రజల తరఫున నిలబడితే చంద్రబాబు అహంకారంతో దూషించడం ఎంత మాత్రం తగదన్నారు. -
కోర్టుకు వెళితే ఉన్మాది అంటారా?
-
'రాష్ట్రంలో భూ బకాసురుల పాలన'
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌లో భూ బకాసురుల పరిపాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఆయన బుధవారం మాట్లాడుతూ...చంద్రబాబు బినామీ పేర్లతో లక్ష కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారన్నారు. రాజధాని ముసుగులో బాబు అక్రమ భూ దందాను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. -
'చంద్రబాబుకు ఆ పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరింది'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ సీపీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని, ఆ పిచ్చి కాస్తా పీక్ స్టేజ్‌కి చేరిందని ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కార్యాలయంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవన్న చంద్రబాబు, తన ప్రచారానికి మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని శంకుస్థాపన పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాలలో రూ.1650 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే అందులో రూ.1400 కోట్లు దుర్వినియోగం అయ్యాయని బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పథకాల పేరుతో వందల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న అథితులకు వాళ్ల సొంత హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేసి ప్రజలు, ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెడుతున్నారని బత్తుల ఆరోపించారు. -
మీరు ఏం తెచ్చారు.. ఏం చేశారు?
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ తానే దిక్కంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండించింది. ఓ హోదాలో ఉన్న వెంకయ్య నాయుడు తెలుగు ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడవద్దని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంకయ్యల మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు గానీ, టీడీపీ ప్రతినిధిలా మాట్లాడవద్దని హితవు పలికారు. బీజేపీ ప్రతినిధి అనే విషయం వెంకయ్య మరవకూడదన్నారు. ఏపీకి తాను పెద్ద దిక్కంటూ వ్యాఖ్యానిస్తున్న వెంకయ్య.. ఈ 15 నెలల్లో రాష్ట్రానికి ఏం తెచ్చారో.. ఏం చేశారో? చెప్పాలని బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. ఆరు కోట్ల ఏపీ ప్రజలను చులకనగా మాట్లాడొద్దన్నారు. మీరు, చంద్రబాబు కలిసే హైదరాబాద్ ను అభివృద్ధి చేశారా?అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేక హోదాపై ఈనెల 29న వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కు ప్రజలు సమాయత్తమవుతున్నారన్నారు. బంద్ ను వ్యతిరేకించే వారు అభివృద్ధికి నిరోధకులని ఆయన తెలిపారు. -
'తెలుగోడి గౌరవం.. ఢిల్లీ వీధుల్లో తాకట్టు!'
-
'తెలుగోడి గౌరవం.. ఢిల్లీ వీధుల్లో తాకట్టు!'
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి10 నెలలు అయిందని, ఇప్పటివరకు ఆయన ఏ వాగ్దానాన్నైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉండి కూడా ఏ రోజూ కేంద్రంతో పోరాడలేదన్నారు. కేంద్రాన్ని నిలదీయలేనివారు ఆ ప్రభుత్వంతో ఎందుకు కొనసాగుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏనాడైనా వారిని హెచ్చరించారా అని మండిపడ్డారు. ఏపీ కి అన్యాయం జరుగుతుంటే అధికారాన్ని అనుభవించాలన్న స్వార్థంతోనే టీడీపీ అధినాయకులు కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు. -
జగన్‌ను విమర్శించే అర్హత మంత్రులకు లేదు
ఒంగోలు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి రైతు భరోసా యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక మంత్రులు విమర్శిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలపై ప్రజా తిరుగుబాటును గమనించిన మంత్రులు ఏ చేయాలో తెలియక జగన్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. జగన్‌పై విమర్శలు చేసే మంత్రులు ఎవరైనా దమ్ముంటే రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి గెలవగలరా అని పశ్నించారు. 44 శాతం ఓట్లతో ఒక కోటీ 30 లక్షల మంది ప్రజల మద్దతు పొందిన జగన్ ఉనికిని ప్రశ్నించే సాహసం మీకెక్కడిదని ఆయన నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలన్నింటిని తుంగలో తొక్కి రాజధాని పేరుతో రియల్ఎస్టేట్ వ్యాపారానికి విలువ ఇచ్చే మీరు, ఏ ముఖం పెట్టుకుని జగన్‌ను విమర్శిస్తారని ఆయన ప్రశ్నించారు. దేశంలోనే గొప్ప పరిపాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి, ఆయన పాలనలో 20 వేల మంది రైతులు చనిపోయినట్లు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మంత్రులు, తెలుగుదేశం నాయకులు జగన్‌పై చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే జగనంటే వారు ఎంత భయపడుతున్నారో అర్ధం అవుతుందన్నారు. మంత్రులు ఇప్పటికైనా పిచ్చి విమర్శలు మాని జగన్ మద్దతు తీసుకుని కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి పొందేందుకు పోరాటం చేయాలన్నారు.