'ఇంజినీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి'
హైదరాబాద్ : ఇంజినీర్లు అసమర్థులన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తెలుగువారిని కించపరచడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తులు బ్రహ్మానందరెడ్డి అన్నారు.
ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 'దేశంలోనే గొప్ప ఇంజినీర్ల మన తెలుగు గడ్డపై పుట్టిన విషయం చంద్రబాబుకు తెలియదా?. నాసాలో కూడా 36శాతం ఇంజినీర్లు భారతీయులే. వెంటనే ఇంజినీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో టీడీపీ నేతలు ఎందుకు పెట్టుబడులు పెట్టారు?. హోదా అవసరం లేదంటున్న టీడీపీ నేతలు ఏపీలో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు?' అని ప్రశ్నించారు.
ఇటీవల రాయలసీమ పర్యటనలో భాగంగా చంద్రబాబు... తన మొహమాటంతో ఇన్నాళ్లు మిమ్మల్ని శిక్షించకుండా క్షమించానని, నా వేగాన్ని అందుకోవాలి, లేదంటే వెళ్లిపోవాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.