ప్రతి జిల్లాలో 50వేల ఎకరాల భూసేకరణా?
ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం మరో ఏడు లక్షల ఎకరాలు సేకరించటానికి ప్రభుత్వం సిద్ధం గా ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొనటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. రైతుల నుంచి లక్షల ఎకరాలు సేకరించి పరిశ్రమల పేరుతో ఎవరికి పడితే వారికి ఇస్తామని ప్రకటన చేయటం చంద్రబాబు ప్రభుత్వ భూదాహానికి నిదర్శమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బత్తుల మాట్లాడు తూ... చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలతో రైతుకు, భూమికి ఉండే బంధాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో మూడు లక్షల ఎకరాలను సేకరించామని జీవో జారీ చేసిన ప్రభుత్వం మరో ఏడు లక్షల ఎకరాలను సేకరించి 10 లక్షల ఎకరాల భూ బ్యాంకును ఏర్పాటు చేస్తామనడంపై మండిపడ్డారు.
ఒక్కో జిల్లా నుంచి 50 వేల ఎకరాల చొప్పున 13 జిల్లాల నుంచి సేకరిస్తామని చెప్ప డం సరికాదన్నారు. శాశ్వ తంగా రైతుల్ని మోసం చేయటమే చంద్రబాబు విధానమా? అని ప్రశ్నిం చారు. రుణమాఫీ వల్ల రైతులు బయటపడకపోగా రుణఊబిలో కూరుకుపోయే పరిస్థితులు దాపురించాయ న్నారు. రూ.10వేల కోట్లు మాత్రమే చెల్లించి.. మూడోవంతు రుణాలు మాఫీ చేశామని ప్రకటనలు చేస్తూ ప్రజల్ని, రైతులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు.