
నీ చేతగానితనానికి జగన్‌పై నిందలా? : బత్తుల
చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: చేతగాని పరిపాలనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక ఆ ప్రజల దృష్టి మరల్చడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి జగన్ అడ్డుపడుతున్నారంటూ చంద్రబాబు చెబుతున్న మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరని చెప్పారు.
పవిత్ర పుష్కరాలు జరుగుతున్న కృష్ణా నది ఒడ్డున కూర్చుని రాజకీయం చేస్తూ చంద్రబాబు ఇలా మాట్లాడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన భై ఏళ్ల వయసు, 60 ఏళ్ల పాత్రికేయ అనుభవం ఉన్న ఏబీకే ప్రసాద్ ప్రజల తరఫున నిలబడితే చంద్రబాబు అహంకారంతో దూషించడం ఎంత మాత్రం తగదన్నారు.