
పేకాడుతూ పట్టుపడ్డ సినీనటి
ప్రముఖ హాస్యనటి ఒకరు పేకాడుతూ పోలీసులకు దొరికిపోయింది. ఆదివారం రాత్రి ఎల్బీనగర్ చింతల్ కుంటలో పేకాట స్థావరం నడుస్తోంన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు నిర్వహించారు.
పేకాడుతూ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోలీసులకు దొరికిపోయింది. ఆదివారం రాత్రి వనస్థలిపురం పరిధిలోని జహంగీర్‌కాలనీలో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాడుతున్న సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణితోపాటు 11మందిని అరెస్ట్‌చేశారు.
కాగా పోలీసుల్ని చూసి జూదగాళ్లు పారిపోయే ప్రయత్నం చేయగా, వారిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిసింది. పేకాట స్థావరంలో రూ. 75 వేల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. కాగా తనను కావాలనే ఇరికించారని కల్యాణి వాపోయింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.