నర్సరావుపేట (గుంటూరు జిల్లా): పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు 18మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శనివారం గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని లలితానగర్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. లలితానగర్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో గుంటూరు ప్రత్యేక పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడిలో 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.8లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో టీడీపీ నేతలున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
Published Sat, May 9 2015 5:58 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement