కరీంనగర్: పేకాట ఆడుతూ ఓ మాజీ ఎమ్మెల్యే పోలీసులకు దొరికిపోయారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి శివారులో పేకాట స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే బండి పులయ్య సహా ఐదుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 19,900 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పేకాటపై టీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ లో పేకాట క్లబ్బులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మూయించారు. పేకాట క్లబ్బులను తెరిపించేందుకు నిర్వాహకులు ఎంత ఒత్తితెచ్చినా ఆయన వెనకడుగు వేయడం లేదు.
పేకాట ఆడుతూ దొరికిన మాజీ ఎమ్మెల్యే
Published Sun, Nov 2 2014 7:24 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement
Advertisement