elkathurthy
-
భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..!
సాక్షి, ఎల్కతుర్తి(వరంగల్ అర్బన్) : ఆ తల్లి పేగు తెంచుకుని జన్మించిన కుమారుడే ఆమె అంత్యక్రియలను అడ్డుకున్నాడు. తల్లి పేరిట ఉన్న భూమిని రాసిచ్చే వరకు తలకొరివి పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధి జీల్గుల గ్రామంలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి సారయ్య–రాజమ్మ(70) దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే సారయ్యతో పాటు పెద్ద కుమారుడు సమ్మయ్య అనారోగ్యంతో మృతిచెందారు. ప్రస్తుతం రెండో కుమారుడు జంపయ్య, చిన్న కుమారుడు రవీందర్ ఉన్నారు. వీరికి గతంలోనే ఆస్తుల పంపకాలు పూర్తి కాగా, తల్లి రాజమ్మ పేరిట ఎకరన్నర భూమి ఉంది. వృద్ధా ప్యంతో రాజమ్మ బుధవారం రాజమ్మ మృతి చెందింది. తల్లికి సంప్రదాయం ప్రకారం చిన్నకుమారుడు రవీందర్ కర్మకాండలు నిర్వహించాల్సి ఉండగా.. అతడు అంగీకరించలేదు. తల్లి పేరిట ఉన్న భూమిని తనకు రాసిస్తేనే తలకొరివి పెడతానని స్పష్టం చేశాడు. దీంతో తల్లి మృతదేహం పక్కనే కొడుకులిద్దరూ గొడవకు దిగారు. గ్రామస్తులు, పోలీసులు చెప్పినా కూడా రవీందర్ వినలేదు. దీంతో రెండో కుమారుడు జంపయ్య తన తల్లికి అంత్యక్రియలు పూర్తిచేశాడు. -
విద్యాశాఖ మంత్రి తెలుసా?
ఎల్కతుర్తి: వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తిలోని ఆదర్శ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నైపుణ్యాలను ఆరా తీసే క్రమంలో పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పేరు ఏమిటని అడగగా విద్యార్థుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక విద్యార్థి రాజు పాఠశాలకు రాలేదని తెలుసుకున్న జనార్ధన్‌రెడ్డి ఆయన తండ్రికి ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశారు. పిల్లలకు పనులు చెప్పకుండా రోజూ బడికి పంపించాలని సూచించారు. -
బాలిక కిడ్నాప్?
హసన్‌పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్ నుంచి కిడ్నాప్‌కు గురైన ఓ బాలికను హసన్‌పర్తి పోలీసులు సోమవారం కాపాడినట్లు తెలిసింది. భీమదేవరపల్లికి చెందిన ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థిని రెండు రోజుల క్రితం ఎల్కతుర్తిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో స్నేహతురాలిని కలవడానికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆమె బస్సు కోసం వేచి చూస్తుండగా హసన్ పర్తి మండలం అన్నాసాగరం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి వివిధ ప్రాంతాల్లో తిప్పాడు. రాత్రి కావడంతో ఆ బాలికను హసన్‌పర్తి మండలం వంగపహాడ్లో ఉంటున్న తన సోదరి వద్దకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఉదయం ఆ బాలిక తనను కిడ్నాప్ చేశారని డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు బాధితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుడి ఫోన్ ఆధారంగా హసన్‌పర్తి మండలం అన్నాసాగరంగా గుర్తించి గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. -
పేకాట ఆడుతూ దొరికిన మాజీ ఎమ్మెల్యే
కరీంనగర్: పేకాట ఆడుతూ ఓ మాజీ ఎమ్మెల్యే పోలీసులకు దొరికిపోయారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి శివారులో పేకాట స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే బండి పులయ్య సహా ఐదుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 19,900 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాటపై టీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ లో పేకాట క్లబ్బులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మూయించారు. పేకాట క్లబ్బులను తెరిపించేందుకు నిర్వాహకులు ఎంత ఒత్తితెచ్చినా ఆయన వెనకడుగు వేయడం లేదు.